శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Modified: సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (12:25 IST)

శిఖా చౌదరి నన్ను బాగా వాడుకుంది... దుబాయ్ తీస్కెళ్లి... ప్రియుడు రాకేష్

ప్రముఖ వ్యాపారవేత్త జయరాం కేసుకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. శిఖా చౌదరికి డబ్బు పిచ్చి ఎక్కువనీ, తనను డబ్బు కోసం వాడుకుందనీ, తన నుంచి రూ. 1 కోటి రూపాయలు వాడుకోవడమే కాకుండా పెళ్లాడుతానని నమ్మించి వంచించిదని వెల్లడించాడు ఆమె ప్రియుడు రాకేష్. ఆమెతో పెళ్లి ఫిక్స్ అని నమ్మిని తను కోట్ల రూపాయలు ఖర్చు చేసి మోసపోయానని వెల్లడించినట్లు తెలుస్తోంది. 
 
జయరాం తన కంపెనీలో ఉద్యోగుల జీతాల చెల్లించాలంటూ తన వద్ద నాలుగున్నర కోట్ల రూపాయలు తీసుకున్నాడనీ, ఆ సమయంలోనే తనకు శిఖా చౌదరితో పరిచయం ఏర్పడి అది ప్రేమకు దారి తీసిందని వెల్లడించాడు. ఆ తర్వాత ఆమె వ్యవహారం చూసి తను మోసపోయానని తెలుసుకున్నాననీ, ఐతే తన డబ్బు తనకు ఇచ్చేస్తే వెళ్లిపోతానని చెప్పినట్లు విచారణలో వెల్లడించినట్లు సమాచారం.
 
డబ్బు తీసుకున్న జయరాం అమెరికాలో వుండటంతో అతడు ఎప్పుడు వస్తాడా అని కాచుకుని కూర్చున్న రాకేష్‌కు జనవరి 29న జయరాం వచ్చినట్లు తెలుసుకుని అతడి వద్దకు వెళ్లాడు. జనవరి 31న జూబ్లిహిల్స్ ప్రాంతంలో వున్న తన ఇంటికి పిలిచి డబ్బు అడగ్గా అతడు వాగ్వాదానికి దిగినట్లు చెప్పాడు. కోపంతో అతడిని కొట్టడంతో అసలే గుండె జబ్బుతో బాధపడుతున్న జయరాం ఆ దెబ్బలకు చనిపోయాడు. ఐతే శిఖా చౌదరి తనను బాగా వాడుకుందనీ, తను మాత్రమే కాదు... ఇంకా ఎందరో ఆమె బాధితులుగా వున్నారంటూ రాకేష్ వెల్లడించాడు.