మండిపోతున్న ఎండలు... కమిలిన చర్మానికి కలబందతో చెక్...
ఇదివరకటి రోజుల్లో ఎండకాలం, వానాకాలం. చలికాలం అంటూ క్రమం తప్పకుండా రుతువులు వచ్చేని. ప్రస్తుతం రుతువులు తారుమారై ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండలో తిరగడం వలన చర్మం కమిలిపోయి, ముఖం, చేతులపై సూర్యకిరణాలు పడి చర్మంలో కాస్త తేడా వస్తుంది. ముఖ్యంగా స్త్రీలు స్కిన్ టాన్ సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు.
ఈ విధంగా చర్మ కమిలిపోకుండా ఉండాలంటే ప్రకృతిసిద్ధంగా లభ్యమయ్యే అలోవిర్(కలబంద) అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఎండకు వాడిపోయిన చర్మానికి చక్కటి గ్లో తెస్తుంది. డైరెక్ట్‌గా అలోవిరా రసాన్ని మాయిశ్చరైజ్ చేస్తే ముఖంలో వెలుగు రావటంతో పాటు సున్నితత్వం పెరుగుతుంది.
ఈ కలబంద ఎండకు కమిలిన చర్మానికి మునుపటి అందం తీసుకువస్తాయి. ఎండలో నుంచి వచ్చాక మొదట ఫేస్‌ని తొలుత చన్నీళ్లతో శుభ్రపరచుకోవాలి. ఆ తర్వాతే ఈ నేచురల్ ఫేస్ ప్యాక్స్‌ని అప్లై చేసుకోవాలి. తద్వారా ముఖ్య తేజస్సుతోపాటు, సున్నితత్వం కూడా పెరుగుతుంది.