సంబంధిత వార్తలు
- గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగాల సృష్టికి టెక్నాలజీ ఇంక్యుబేటర్స్ ఉపయుక్తం: ఏపీ గవర్నర్
- ఆప్ఘనిస్థాన్‌లో తాలిబన్ల ప్రభుత్వం ఇదే.. 11మందితో సర్కారు
- ఆప్ఘన్ రాజకీయాల్లో వేలెట్టిన పాకిస్థాన్.. కాబూల్‌లో వ్యతిరేక ర్యాలీలు
- గర్జిస్తున్న షంజ్‌పీర్ : చివరి రక్తపుబొట్టువరకు పోరాడుతాం
- 1000 మంది విమానాశ్రయంలోనే... కాబూల్‌లోనే ఫ్లైట్స్
క్యూబాలో రెండేళ్ల చిన్నారులకు కరోనా టీకాలు
ప్రపంచవ్యాప్తంగా కరోనా కట్టడికి టీకాలు వేసే కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. అయితే టీకాలు వేసే విషయంలో క్యూబా మరో ముందడుగు వేసింది. ప్రపంచంలోనే తొలిసారిగా క్యూబాలో రెండేళ్ల చిన్నారులకు కూడా కరోనా టీకాలు వేయడం ప్రారంభించారు.
క్యూబాలో స్థానికంగా తయారు చేసిన రెండు రకాల టీకాలను వినియోగిస్తున్నారు. అయితే ఈ టీకాలకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(డబ్ల్యుహెచ్‌ఓ) గుర్తింపునివ్వలేదు.
మీడియాకు అందిన వివరాల ప్రకారం క్యూబాలో... అబ్దలా, సోబర్నా అనే రెండు రకాల టీకాలను తయారు చేశారు. పిల్లలపై ఈ వ్యాక్సీన్ల క్లీనికల్ ట్రయల్స్ పూర్తయ్యింది.
దీంతో దేశంలోని చిన్నారులకు కరోనా వ్యాక్సీన్ ఇవ్వడం ప్రారంభించారు. ముందుగా 12 ఏళ్లు, అంతకుమించిన వయసుగల వారికి టీకాలు ఇస్తున్నారు.
తర్వాతి కథనం
