1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Indian Origin Woman Shot Dead Inside US Supermarket

US Supermarket: భారతీయ మహిళను కాల్చి చంపిన దుండగుడు

US super Market
US super Market
అమెరికాలోని వర్జీనియాలో ఉన్న ఒక డిపార్ట్‌మెంటల్ స్టోర్‌లో, గుజరాత్‌కు చెందిన ఒక భారతీయ మహిళను కాల్చి చంపబడింది. ఈ ఘటన అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. మృతురాలిని 45 ఏళ్ల మేఘనాబెన్ పటేల్‌గా గుర్తించారు. ఈమె గత పదేళ్లుగా ఆ సూపర్ మార్కెట్‌లో పనిచేస్తున్నారు. 
 
ఈమె మెహసానా జిల్లాలోని విజపూర్ తాలూకాకు చెందిన జంత్రాల్ గ్రామానికి చెందినవారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం.. ఇది ఒక దోపిడీ ప్రయత్నంగా కనిపిస్తోంది. ముఖానికి మాస్కు ధరించిన ఒక దుండగుడు, కస్టమర్ లాగా నటిస్తూ, బిల్లింగ్ కౌంటర్ వద్ద నిలబడి ఉన్న మేఘనాబెన్‌తో సంభాషించడం కనిపిస్తుంది. 
 
కొద్దిసేపు మాట్లాడిన తర్వాత, ఆ దుండగుడు ఒక్కసారిగా తుపాకీ తీసి ఆమెపై పలుమార్లు కాల్పులు జరిపాడు. దాంతో బాధితురాలు అక్కడికక్కడే నేలకొరిగింది. కాల్పులు జరిపిన వెంటనే ఆ దుండగుడు అక్కడి నుండి పారిపోయినట్లు ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. 
 
ఈ ఘటన గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు అప్రమత్తమై, కొద్దిసేపటికే ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు నేరం జరిగిన ప్రాంతాన్ని దిగ్బంధించి, దర్యాప్తు ప్రారంభించారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తిని గుర్తించేందుకు పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. 
 
మేఘనాబెన్‌కు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరంతా ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్నారు. ఆమె తల్లిదండ్రులు మాత్రం తమ స్వగ్రామంలో నివసిస్తున్నారు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
బ్యాంక్ ఆఫ్ బరోడాలో రూ.8.70 కోట్లు మాయం.. లక్కీ భాస్కర్ తరహాలో...? (video)