1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. New Jersey Candy Store Makes Chocolate High Heels

అయ్యబాబోయ్ చెప్పుల్ని తినేస్తున్నారు.. (video)

ఇదేంటి.. చెప్పుల్ని తింటున్నారా? వాళ్లెవరండి బాబూ అనుకుంటున్నారు కదూ.. అయితే చదవండి. సాధారణంగా మనం తొడుక్కునే చెప్పుల్ని వీరు తినట్లేదు. చెప్పుల ఆకారంలో వున్న చాక్లెట్లను తెగ లాగిస్తున్నారు. చెప్పుల ఆ

chocolate shoes
ఇదేంటి.. చెప్పుల్ని తింటున్నారా? వాళ్లెవరండి బాబూ అనుకుంటున్నారు కదూ.. అయితే చదవండి. సాధారణంగా మనం తొడుక్కునే చెప్పుల్ని వీరు తినట్లేదు. చెప్పుల ఆకారంలో వున్న చాక్లెట్లను తెగ లాగిస్తున్నారు. చెప్పుల ఆకారంలో న్యూజెర్సీ క్యాండీ స్టోర్ చాక్లెట్లను తయారు చేస్తోంది. ఈ చాక్లెట్లు కొత్తగా వుండటంతో పాటు రుచిగా వుండటంతో... కస్టమర్లు ఆబగా తినేస్తున్నారు. 
 
రుచికరమైన స్లిప్పర్ చాక్లెట్లను కొనేందుకు షాపు ముందు కస్టమర్లు క్యూ కడుతున్నారు. చెప్పుల ఆకారాల్లో వుండే చాక్లెట్లను తినేందుకు కస్టమర్లు ఆసక్తి చూపుతున్నారు. ఈ స్లిప్పర్ క్యాండీలను కస్టమర్లు లాగించే వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి. 
 
తర్వాతి కథనం
జీవించాలా? లేక మరణించాలా? రాష్ట్రపతే తేల్చాలి : ట్రాన్స్‌వుమన్