1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. PM Modi Speaks To Flydubai Pilot Captain Smit Machchaar

కెప్టెన్ స్మిత్ మచ్చార్‌తో ప్రధాని.. ధైర్యానికి ప్రశంసలు.. రక్తంతో తడిసి, ఆక్సిజన్ మాస్క్ ధరించి? (video)

Smit Machchaar
Smit Machchaar
ఇజ్రాయెల్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానాన్ని కూల్చివేయడానికి తన కో-పైలట్ చేసిన యత్నాన్ని భగ్నం చేసిన కెప్టెన్ స్మిత్ మచ్చార్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం మాట్లాడి, అతని ధైర్యాన్ని ప్రశంసించారు. ఈ టెలిఫోన్ సంభాషణలో, మచ్చార్ తన అనుభవాన్ని, ఆ సంఘటన సమయంలో తనకు ధైర్యాన్నిచ్చిన అంశాలను వివరించారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 
 
పైలట్ ధైర్యాన్ని ప్రధాని మోదీ ప్రశంసించి, అతను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లోనూ, తీవ్రంగా గాయపడినప్పటికీ, ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు మచ్చర్ అపారమైన ధైర్యాన్ని. అచంచలమైన సంకల్పాన్ని ప్రదర్శించారని ప్రధాన మంత్రి గురువారం పేర్కొన్నారు. 
 
మచ్చర్ ఒక హీరో అని, ఆయన ప్రదర్శించిన వీరత్వం వందలాది ప్రాణాలను కాపాడటంతో పాటు ఒక పెద్ద విషాదాన్ని నివారించడంలో సహాయపడిందని మోదీ అన్నారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) శతాబ్ది ఉత్సవాల్లో ప్రసంగిస్తూ, ఫ్లైదుబాయ్ విమాన పైలట్ గొప్ప సహనం, వివేకం, ధైర్యాన్ని ప్రదర్శించారని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. 
 
అలాగే "ఈ భారతీయుడు 9/11 తరహా దాడిని అడ్డుకున్నారని ఇజ్రాయెల్ ప్రధాని (బెంజమిన్ నెతన్యాహు) స్వయంగా పేర్కొన్నారు. స్మిత్ ప్రదర్శించిన ధైర్యం ప్రతి భారతీయుడి హృదయాన్ని గర్వంతో నింపుతుంది," అని ఆయన అన్నారు. వందలాది మంది ప్రాణాలను కాపాడిన స్మిత్ ధైర్యసాహసాలను ప్రశంసిస్తూ, ప్రధాని మోదీ ఆయన భార్య, తల్లిదండ్రులతో కూడా మాట్లాడారు. 
 
దుబాయ్ నుండి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానం (FZ1073) బుధవారం నాడు అత్యవసర సంకేతాలను పంపింది. సౌదీ అరేబియాలోని తబుక్ నగరంలో ఉన్న ప్రిన్స్ సుల్తాన్ బిన్ అబ్దుల్ అజీజ్ విమానాశ్రయానికి మళ్లించబడటానికి ముందు, ఆ విమానం 34,000 అడుగుల ఎత్తు నుండి 17,000 అడుగుల కంటే ఎక్కువ మేర వేగంగా కిందకు దిగింది. 
 
ఈ విమానంలో 27 మంది పిల్లలతో సహా మొత్తం 174 మంది ప్రయాణికులు ఉన్నారు. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వీడియోలలో, పైలట్ రక్తంతో తడిసి, ఆక్సిజన్ మాస్క్ ధరించి, విమానం గ్యాలీలో వెల్లకిలా పడుకుని కనిపించాడు. తన ప్రకటనలో నెతన్యాహు మాట్లాడుతూ, విమానం అదుపుతప్పి కిందకు దిగడం ప్రారంభించిందని ఒక ఇజ్రాయెల్ ప్రయాణికుడు తనకు చెప్పినట్లు తెలిపారు.
 
ఆ తర్వాత, ఆ ప్రయాణికుడు, ఒక సిబ్బంది సభ్యుడు కాక్‌పిట్‌లోకి చొరబడ్డారని, విమాన వ్యవస్థలను ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో కత్తితో పొడిచిన పైలట్‌ను వారందరూ కలిసి అదుపులోకి తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
CJP: అవినీతిమయమైన వ్యవస్థ యువత జీవితాన్ని హరింపజేస్తోంది..సీజేపీ