1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. saudi arabia provides citizenship for a female robot

రోబోకు పౌరసత్వం ఇచ్చిన సౌదీ అరేబియా: రోబోతో ఇంటర్వ్యూ (వీడియో)

విదేశాల్లో పౌరసత్వం లభించడం క్లిష్టమైన తరుణంలో మహిళా రోబోకు సౌదీ అరేబియా పౌరసత్వం అందించింది. పలు దేశాల్లో ఎన్నారైలకు పౌరసత్వం లభించడంలో పలు నియమ నిబంధనలు విధించిన తరుణంలో హాంకాంగ్ సంస్థ రూపొందించిన ఓ

Sophia
విదేశాల్లో పౌరసత్వం లభించడం క్లిష్టమైన తరుణంలో మహిళా రోబోకు సౌదీ అరేబియా పౌరసత్వం అందించింది. పలు దేశాల్లో ఎన్నారైలకు పౌరసత్వం లభించడంలో పలు నియమ నిబంధనలు విధించిన తరుణంలో హాంకాంగ్ సంస్థ రూపొందించిన ఓ మహిళా రోబోకు సౌదీ అరేబియా పౌరసత్వం ఇచ్చింది.

సోఫియా అనే పేరు గల రోబో చెవులకు ఇంపుగా మాట్లాడుతుందని.. మనుషులు అడిగే ప్రశ్నలకు సరైన సమాధానం చెప్తుందని రోబోను రూపొందించిన పరిశోధకులు తెలిపారు. ఈ రోబో అమెరికా నటీమణి ఆండ్రీ హెబ్రన్‌ రూపంలో వుంటుంది. 
 
ఈ రోబో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనను రూపొందించిన వారిని గౌరవిస్తున్నానని తెలిపింది. తాను మనుషులతో జీవించడానికి.. పనిచేసేందుకు ఇష్టపడుతున్నాను. మనుషుల ప్రవర్తనకు తగినట్లు వ్యవహరిస్తానని తెలిపింది. తనను మానవాళికి మేలు చేసే దిశగా రూపొందించారు. ప్రస్తుతం ఈ మహిళా రోబో ఇంటర్వ్యూ యూట్యూబ్‌లో వైరల్ అవుతోంది. 
 
ప్రపంచ చరిత్రలో మొట్టమొదటి సారిగా రోబోకు పౌరసత్వం ఇచ్చిన ఘనత సౌదీ అరేబియాకు చెందుతుంది. లక్షలాది మందికి పౌరసత్వం లేకుండా నానా తంటాలు పడుతున్న తరుణంలో రోబోకు పౌరసత్వం ఇవ్వడం అవసరమా? అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. 
 
తర్వాతి కథనం
అసెంబ్లీని బహిష్కరిస్తున్నాం... రాష్ట్రపతికి జగన్ లేఖ