బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 25 జులై 2017 (11:40 IST)

నిషిద్ధ వస్తువుల జాబితాలో అశ్లీల వీడియోలు.. ఆడియో క్లిప్‌లు.. ఎక్కడ?

నిషిద్ధ వస్తువుల జాబితాలో అశ్లీల వీడియోలు, ఆడియో క్లిప్‌లను కూడా సౌదీ అరేబియా చేర్చింది. ఇవి వస్తురూపంలో అంటే మొబైల్ లేదా ల్యాప్‌టాప్‌లలో ఉంటే సౌదీ పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటారట. అందుకే సౌదీ అ

నిషిద్ధ వస్తువుల జాబితాలో అశ్లీల వీడియోలు, ఆడియో క్లిప్‌లను కూడా సౌదీ అరేబియా చేర్చింది. ఇవి వస్తురూపంలో అంటే మొబైల్ లేదా ల్యాప్‌టాప్‌లలో ఉంటే సౌదీ పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటారట. అందుకే సౌదీ అరేబియా వెళ్ళేవారు స్మార్ట్‍‌ఫోన్, ల్యాప్‌ట్యాప్‌లలో ఇవి లేకుండా జాగ్రత్త పడాల్సి ఉంది.
 
వీటితోపాటు మాదకద్రవ్యాలు, గసగసాలు, పంది మాంసం, తమలపాకులు, పాన్ మసాలాలతోపాటు ఇస్లాం కాకుండా ఇతర మతాలకు సంబంధించిన గ్రంథాలు లేదా సాహిత్యాన్ని కూడా తీసుకెళ్లడం నిషేధమని వారు స్పష్టం చేశారు. ముస్లిం ఖాజాలిచ్చే తాయెత్తులను కూడా సౌదీ అరేబియా అనుమతించడం లేదని వారు స్పష్టం చేశారు.
 
సౌదీలో పని చేసే విదేశీ కార్మికుల్లో భారతీయుల సంఖ్య భారీగా ఉంటుంది. దీంతో సౌదీలో ఉపాధి కోసం వెళ్లేవారు ఆ దేశ ప్రభుత్వం విధించిన నిషేధిత వస్తువులపై పెద్దగా అవగాహన ఉండదు. అందుకే కేంద్ర ప్రభుత్వం సౌదీలో సవరించిన నిబంధనలపై అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.