1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Somalia beach terror strikes: Al-Shabaab attack leaves 32 dead

సోమాలియాలో హోటల్‌పై ఆత్మహుతి దాడి.. 32 మంది మృతి

suicide bombers
సోమాలియా దేశంలోని ఓ హోటల్‍పై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో దాదాపు 32 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. అలాగే పోలీసులు జరిపిన కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడింది తామేనంటూ అల్ ఖైదా ఉగ్ర సంస్థకు చెందిన అనుబంధ విభాగం అల్ షబాబ్ ప్రకటించింది. 
 
ఆఫ్రికా ఖండంలో అత్యంత పేద, కల్లోలభరిత దేశంగా గుర్తింపు పొందిన సోమాలియాలో ఉగ్రవాదులు పెట్రేగిపోతున్నారు. తాజాగా ఓ హోటల్‌పై ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 63 మందికి గాయాలయ్యాయి. ఈ ఉగ్రదాడికి తామే బాధ్యలమంటూ అల్ షబాబ్ ప్రకటించింది. 
 
సోమాలియా రాజధాని మొగదిషు నగరంలోని లిడో బిచ్‌కు సమీపంలో ఉన్న ఈ హోటల్‌పై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఓ ఆత్మాహుతి దళ సభ్యుడు వంటినిడా పేలుడు పదార్థాలు అమర్చుకుని తనను తాను పేల్చుకున్నాడు. భద్రతా బలగాలు స్పందించి కాల్పులు జరపడంతో నలుగురు సాయుధ ఉగ్రవాదులు మరణించారు. మరో ఉగ్రవాదిని సజీవంగా పట్టుకున్నారు. 
తర్వాతి కథనం
జనసేన ఎమ్మెల్యే వినతి ... ఫీజు బకాయి మొత్తం మీఫీ చేసిన తక్షశిల ఐఏఎస్ అకాడెమీ!