సంబంధిత వార్తలు
- సందీవ్ మాధవ్ "గంధర్వ" మూవీ షూటింగ్ ప్రారంభం
- ఒక్క ఛాన్స్ అడిగితే.. ఒక్క రాత్రి గడపాలన్నాడు : డోనాల్ బిస్ట్ (video)
- కొత్త రకం కరోనా... జాగ్రత్తలు పాటించకుంటే ముప్పు తప్పదు: డబ్ల్యుహెచ్ఓ
- '118' దర్శకుడు కేవి గుహన్ కొత్త చిత్రం 'డబ్లూడబ్లూడబ్లూ'
- డిసెంబరు ఆఖరుకు కరోనా వ్యాక్సిన్... ఎమర్జెన్సీ వినియోగం కింద పంపిణీ : రణ్‌దీప్
దర్శకుడు వెల్లుట్ల ప్రవీణ్ చందర్ ఇంటర్వ్యూ.. "తెర వెనుక" ఏం జరుగబోతోంది..?
Praveen Chandra
"తెర వెనుక" కథాంశం ఎలా వుంటుంది..?
ఏపీ తెలంగాణలో రెండు వందల సినిమా థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేస్తున్నాం. క్రైమ్ థ్రిల్లర్ సోషల్ కాజ్‌గా వస్తున్న మా సినిమాలో రకుల్ ప్రీత్ తమ్ముడు ఆమన్ ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్నాడు. ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో ఇప్పుడున్న సిచువేషన్‌లో ఆడవాళ్ళపై జరుగుతున్న క్రైమ్ థ్రిల్లర్ ను ఈ చిత్రం ద్వారా కొత్తగా చూపిస్తున్నాం. ప్రస్తుతం 101, షి టీములు ఎన్ని ఉన్నా, ఎన్ని జాగ్రత్తలు చెప్పినా ప్రతి మనిషికి స్వీయ రక్షణ ఇంపార్టెంట్ అని ఈ చిత్రం ద్వారా తెలియజేస్తున్నాం
"తెర వెనుక" చిత్రంలో ఎక్స్పెక్ట్ చేయని పాయింట్లు వుంటాయా?
క్రైమ్, థ్రిల్లర్స్ ఎన్నో జరుగుతున్నాయి. ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయని పాయింట్లు ఇందులో చూపించాము. సబ్జెక్ట్ పాతదే అయినా చెప్పే విధానం కొత్తగా ఉంటే ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. రెగ్యులర్ ఫార్మాట్ లో కాకుండా ఈ సినిమాను కొత్తగా తీయడం జరిగింది. ఇందులో 4 పాటలు ఉంటాయి. 45 రోజుల్లో సినిమాను పూర్తి చేసాం.
"తెర వెనుక" హీరో హీరోయిన్ల గురించి..?
హీరో ఆమన్ చాలా చక్కగా నటించాడు. శ్వేతావర్మ ఇందులో డీజీపీగా చేసిన పోలీస్ క్యారెక్టర్ ఈ సినిమాకే హైలెట్ అవుతుంది. మా సినిమా పోలీస్ డిపార్ట్మెంట్ గురించి తీసినా మాకు పోలీస్ స్టార్స్ గురించి కూడా తెలియదు. అందుకే నేను రిటైర్డ్ డి.ఎస్.పి పెట్టుకొని డిపార్ట్మెంట్ పరంగా ఎంతో శ్రద్ధ పెట్టి ఈమూవీని తీయడం జరిగింది. రియల్‌గా పోలీస్ డిపార్ట్మెంట్‌కు బట్టలు, క్యాపు, షూస్ ఎవరు కుడతారో వారితోనే కుట్టించాము. పోలీసు వారి క్రైమ్ ఇన్వెస్టిగేషన్స్, ఎలా ఉంటాయి, వారు ఎలా చేస్తారు అనేది ఇందులో చూపించాము.
హీరో హీరోయిన్స్ ఇద్దరు సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్ వారి మధ్య జరిగే లవ్ స్టోరీ, లవ్ స్టోరీతో పాటు ఒక క్రైమ్ జరుగుతుంది. ఆ క్రైమ్‌ని ఎలా ఇన్వెస్టిగేషన్ చేశారు అనేది ఈ చిత్ర కథాంశం. ఇది ఒక యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ. ఇండియాలో చాలా చోట్ల జరిగిన క్రైమ్స్‌ను ఇన్స్పిరేషన్‌గా తీసుకొని ఈ మూవీ చేయడం జరిగింది. ఇండస్ట్రీ వారు రకుల్ ప్రీత్, సందీప్ కిషన్, మంచు లక్ష్మి, శివారెడ్డి,కా సర్ల శ్యామ్ వంటి చాలామంది మా సినిమాకు సపోర్ట్ చేశారు వారందరికీ ధన్యవాదాలు
పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు తెర వెనుక అంకింతం.. ఎందుకో?
మా చిత్రం ఆడియోను సిటీ ఉమేన్స్ ప్రొటెక్ట్ సెల్ డిజిపి సుమతి గారు వచ్చి విడుదల చేయడం చాలా హ్యాపీగా ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ గురించి తీసినందుకు మేము పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మా సినిమాను డెడికేట్ చేస్తున్నాము .
"తెర వెనుక" సినిమా రిలీజ్ గురించి..?
ప్రస్తుతం కరోనా ప్రాబ్లం తో థియేటర్లలో 50% మాత్రమే ఆక్యుపెన్సీ ఉన్నా.. కమర్షియల్, మెసేజ్ ఓరియెంటెడ్‌గా వస్తున్న మా చిత్రం కొంతమందికైనా రీచ్ అయితే చాలు. ప్రేక్షకులు బిగ్ స్క్రీన్‌కు కనెక్ట్ అయినట్టుగా ఓ.టి.టి. ఏ టి.టి. టు లాంటి స్మాల్ స్క్రీన్ కు కనెక్ట్ కారని మా నిర్మాత చెప్పడంతో బిగ్ స్రీన్ లో మా "తెర వెనుక" చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ఈ నెల జనవరి నూతన సంవత్సర శుభాకాంక్షలతో జనవరి 1న వస్తున్న మా "తెరవెనక" చిత్రాన్ని చూసి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం .
తదుపరి ప్రాజెక్టులు..?
త్వరలో వస్తున్న నా నాలుగవ సినిమా "సంత" మట్టి మనుషుల ప్రేమ కథ చిత్రం కూడా అద్భుతమైన సినిమా, బ్యాక్ టు బ్యాక్ ఒకేసారి రెండు సినిమాలు రావడం నాకు చాలా ఆనందం ఉంది అని అన్నారు.
తెరవెనుక సినిమా నటీనటులు:
అమన్, విశాఖ ధిమాన్, దీపిక రెడ్డి హీరోయిన్ లుగా, ఆనంద చక్రపాణి , నిట్టల శ్రీరామమూర్తి , టి.ఎన్.ఆర్ ,శ్వేత వర్మ , సంపత్ రెడ్డి తదితరులు.
సాంకేతిక నిపుణులు:
నిర్మాత.. విజయ లక్ష్మి మురళి మచ్చ
దర్శకుడు. నెల్లుట్ల ప్రవీణ్ చందర్
కథ, మాటలు – బాబా
కెమెరా – రాము కంద,
ఎడిటర్ – బొంతల నాగేశ్వరరెడ్డి
మ్యూజిక్ – రఘురామ్
ఫైట్స్ – సూపర్ ఆనంద్
డాన్స్- కపిల్, శిరీష్ , అనీష్
లిరిక్స్- కాసర్ల శ్యామ్, సురేష్ బనిశెట్టి , బండి సత్యం రఘురామ్
పిఆరోఒ – మధు వి.ఆర్.
తర్వాతి కథనం
