గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 30 డిశెంబరు 2020 (10:58 IST)

నాకు కూడా కోవిడ్ పాజిటివ్ రావొచ్చు.. మెగా కోడలు ఉపాసన

Upasana_Ramcharan
మెగా ఫ్యామిలీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. మెగా ఫ్యామిలీ హీరోలైన రామ్‌చరణ్‌, వరుణ్‌ తేజ్‌ వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. తనకు వైరస్‌ పాజిటివ్‌ వచ్చిందని, తనకు ఎలాంటి లక్షణాలు లేవని, ప్రస్తుతం హోమ్ క్వారంటైన్‌లో ఉన్నాను. త్వరలోనే కోలుకుని బలంగా తిరిగి వస్తాను అంటూ రామ్‌చరణ్‌ ట్వీట్‌ చేశారు. కొద్దిరోజులుగా తనను కలిసిన వారంతా కరోనా టెస్టులు చేయించుకోవాలని రామ్‌చరణ్ కోరారు. రామ్‌చరణ్‌ కరోనా బారినపడ్డ తర్వాత కొద్ది సేపటికే వరుణ్‌ తేజ్‌ వైరస్‌ పాజిటివ్‌గా పరీక్షించారు.
 
ఇద్దరు మెగా హీరోలు గంటల వ్యవధిలోనే కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో మెగా అభిమానులకు ఆందోళనకు గురయ్యారు. అభిమానులు సహా ఇండస్ట్రీ హీరోలు కూడా వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. 
 
తాజాగా.. మెగా కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల చేసిన ట్వీట్‌ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. చరణ్‌కు పాజిటివ్‌ వచ్చిన తర్వాత తాను కొవిడ్‌ టెస్ట్‌ చేయించుకున్నానని.. నెగెటివ్‌ వచ్చిందని పేర్కొన్నారు. కానీ, తనకు మళ్లీ పాజిటివ్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతానికి హోమ్ క్వారంటైన్‌లో ఉన్నానని, వేడి నీరు, ఆవిరి పట్టడం విశ్రాంతి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ట్వీట్‌ చేశారు.