సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 29 డిశెంబరు 2020 (16:31 IST)

మరో మెగా ఫ్యామిలీ హీరోకు కరోనా పాజిటివ్!

మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలు ఇపుడు కరోనా వైరస్ బారినపడుతున్నారు. మంగళవారం ఉదయమే మెగా ఫ్యామిలీకి చెందిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో అధికారికంగా ప్రకటించారు. ఈ చేదు వార్త మరిచిపోకముందే ఇపుడు మెగా ఫ్యామిలీకి చెందిన మరో మెగా హీరో కరోనా వైరస్ బారినపడ్డారు. 
 
ఆ హీరో పేరు వరుణ్ తేజ్. మెగా బ్రదర్ నాగబాబు తనయుడు. టాలీవుడ్ హీరో. నిజానికి మెగా ఫ్యామిలీలో పలువురికి కరోనా వైరస్ సోకింది. తొలుత చిరంజీవి ఇంట్లో పని చేసే పని మనుషులకు ఈ వైరస్ సోకింది. ఆ తర్వాత చిరంజీవి ఈ వైరస్ బారినపడ్డారు. తాజాగా రామ్ చరణ్, ఇపుడు వరుణ్ తేజ్‌లను ఈ వైరస్ కాటేసింది. 
 
ప్రస్తుతం తనలో స్వల్పపాటి కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయని, అందువల్ల తగిన జాగ్రత్తలు తీసుకుంటూ హోం క్వారంటైన్‌లో ఉంటున్నట్టు చెప్పారు. ఈ వైరస్ బారినుంచి కోలుకుని త్వరలోనే మీ ముందుకు వస్తానని వరుణ్ తేజ్ ఓ ట్వీట్ చేశారు.