సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 29 డిశెంబరు 2020 (08:06 IST)

హీరో రామ్ చరణ్‌ను కాటేసిన కరోనా.. హోం క్వారంటైన్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ను కరోనా వైరస్ కాటేసింది. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో మంగళవారం ఉదయం వెల్లడించారు. తనకు కరోనా వైరస్ సోకిందనీ వెల్లడించారు. అయితే, తనకు కరోనా లక్షణాల్లో ఒక్కటి కూడా లేదని తెలిపారు. అయినప్పటికీ.. హోం క్వారంటైన్‌లోకి వెళ్లినట్టు చెప్పారు. అయితే, ఈ వైరస్ నుంచి త్వరగానే కోలుకుని తిరిగివస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. 
 
కాగా, ఇటీవల చెర్రీ తండ్రి, మెగాస్టార్ చిరంజీవితో పాటు.. ఆయన సోదరుడు నాగబాబుకు కరోనా వైరస్ సోకిన విషయం తెల్సిందే. వీరంతా ఈ వైరస్ నుంచి కోలుకుని, ఇపుడు సాధారణ జీవితాన్ని అనుభవిస్తున్నారు. 
 
కాగా, రామ్ చరణ్ ప్రభుత్వం రెండు సినిమాల్లో నటిస్తున్నారు. అందులో ఒకటి దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్. రెండోది తానే స్వయంగా తన తండ్రి హీరోగా నటిస్తున్న ఆచార్య చిత్రం. ఈ రెండు చిత్రాల షూటింగుల్లో చెర్రీ బిజీగా గడుపుతున్నారు. ఇక్కడ నుంచే ఆయనకు ఈ వైరస్ సోకివుంటుందని భావిస్తున్నారు.