శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : సోమవారం, 28 డిశెంబరు 2020 (10:28 IST)

కొత్త కరోనా కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. మహారాష్ట్ర, కర్ణాటక.. N440K అనే..?

N440k
తెలుగు రాష్ట్రాలను కొత్త కరనా వేరియంట్ వైరస్ చుక్కలు చూపిస్తోంది. ఇప్పటికే యూకే ‘స్ట్రెయిన్’ వైరస్‌ భయంతో గజగజలాడిపోతున్న ప్రజలకు.. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయోలజీ శాస్త్రవేత్తలు మరో దడ పుట్టించే వార్తను చెప్పారు. ఆంధ్రపద్రేశ్‌లో మరో కొత్త రకం కరోనా వైరస్‌ శరవేగంగా విస్తరిస్తోంది. ఆ న్యూ వేరియంట్‌కు N440K అని నామకరణం చేశారు. ఈ కొత్త రకానికి కోవిడ్‌ యాంటీ బాడీస్ నుంచి తప్పించుకునే లక్షణమున్నట్లు సైంటిస్టులు తేల్చారు.
 
కరోనా పాజిటివ్స్‌లో మూడింట ఒక వంతులో ఈ వేరియంట్‌ ఉన్నట్లు గుర్తించారు. ఏపీ నుంచి విశ్లేషించిన 272 కోవిడ్-19 శాంపిళ్ల జీనోమ్ విశ్లేషణలో 34% శాంపిళ్లలో ఎన్440కే రకం ఉన్నట్లు తేలింది.
 
ఇటు ఏపీతో పాటు తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకల్లోనూ ఈ ఎన్440కే వైరస్‌ వెలుగుచూసింది. అలాగే నోయిడాలో కూడా ఒక కోవిడ్ రీ-ఇన్ఫెక్షన్ కేసును కూడా గుర్తించారు. జూలై-ఆగష్టు మధ్య 6,370 మంది జన్యువులను విశ్లేషించగా.. దేశవ్యాప్తంగా రెండు శాతం మందిలో N440K మ్యుటేషన్‌ను గుర్తించారు. కాగా.. జులై-ఆగస్టు నెలల్లో ఆసియాలో ఎన్440కే రకం కరోనా వైరస్ ఆవిర్భవించింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా 5% జీనోమ్ సీక్వెన్సింగ్ చేయాలని కోవిడ్-19 టాస్క్‌ఫోర్స్ నిర్ణయం తీసుకుంది.