శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 డిశెంబరు 2020 (10:49 IST)

కొత్త యేడాదిలో సీఎం జగన్ సర్కారు కొత్తబాదుడు ... మారనున్న 'ట్రాఫిక్ ఫైన్స్

కొత్త సంవత్సరంలో కొత్త బాదుడు ప్రారంభంకానుంది. ట్రాఫిక్ ఫైన్స్ విస్తారంగా పెరగనున్నాయి. రాష్ట్రంలో రోడ్డు ప్ర‌మాదాల్ని అరిక‌ట్టేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జ‌గ‌న్ జ‌న‌వ‌రి 1,2021 నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్‌ను అమ‌లు చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేశారు. ట్రాఫిక్‌ రూల్స్‌కు సంబంధించిన నిబంధనలకు సవరణ చేస్తూ అక్టోబరులో ఇచ్చిన జీవో జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. ఇక ఆ జీవో ప్ర‌కారం కొత్త ట్రాఫిక్ ఫైన్స్ ఇలా ఉండ‌బోతున్నాయి.
 
మైనర్లు డ్రైవింగ్ చేస్తే రూ.5 వేలు, అతివేగంతో బండిన‌డిపితే రూ.1000, ఫైన్ విధించినా ట్రాఫిక్ రూల్స్ పాటించ‌క‌పోతే డ్రైవింగ్ లైసెన్స్ ర‌ద్దు. పోలీసులు వాహ‌నాల్ని త‌నిఖీ చేసే స‌మ‌యంలో ఇబ్బంది పెట్టినా రూ.750, డ్రైవింగ్‌ లైసెన్స్‌కు అర్హతలేని వారు డ్రైవ్ చేస్తే రూ.10,000, ప‌ర్మీట్ లేక‌పోతే రూ.10 వేలు, డ్రైవ్ చేస్తూ సెల్ ఫోన్ మాట్లాడితే రూ.10 వేలు, రేసింగ్‌లో పాల్గొన్న రూ.5 నుంచి రూ.10 వేలు, స్కూల్స్, టెంపుల్స్ ద‌గ్గ‌ర హారన్ కొడితే రూ.వెయ్యి, రెండో సారి అలా చేసినా రూ.2 వేలు ఫైన్ క‌ట్టాల్సి ఉంటుంద‌ని ఏపీ ప్ర‌భుత్వం జారీ చేసిన జీవోలో తెలిపింది.