శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 డిశెంబరు 2020 (09:46 IST)

ఆంధ్రప్రదేశ్‌కు బ్రిటన్ భయం .. కరోనా స్ట్రెయిన్ కలకలం...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బ్రిటన్ భయం పట్టుకుంది. కరోనా స్ట్రెయిన్ కలకలం సృష్టిస్తోంది. బ్రిటిన్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన వారిలో ఆరుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు రాష్ట్ర ఆరోగ్య సంక్షేమ శాఖ కమిషనర్‌ కాటంనేని భాస్కర్‌ తెలిపారు. బాధితులను కొవిడ్‌ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్టు పేర్కొన్నారు. 
 
తూర్పుగోదావరి, కృష్ణా, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో ఒక్కొక్కరికి, గుంటూరులో ఇద్దరికి పాజిటివ్‌గా తేలినట్టు తెలిపారు. వారి శాంపిల్స్‌ను పుణెలోని వైరాలజీ, హైదరాబాద్‌లోని సీసీఎంబీకి ల్యాబ్‌లకు పంపామని చెప్పారు. బ్రిటన్‌లో కరోనా కొత్త స్ట్రెయిన్ కలకలం రేపిన నేపథ్యంలో.. కొత్త వైర్‌పై అపోహలు వద్దని ఆయన సూచించారు. 
 
యూకే నుంచి ఇటీవలికాలంలో 1,213 మంది రాష్ట్రానికి వచ్చారని, వారిలో 1,158 మందిని ఇప్పటికే గుర్తించామని, మరో 56 మంది వివరాలు తెలియాల్సి ఉందని వెల్లడించారు. బ్రిటన్‌లో కరోనా కొత్త స్ట్రెయిన్ కలకలం రేపిన నేపథ్యంలో ఈ మధ్యకాలంలో బ్రిటన్‌ నుంచి గుంటూరు జిల్లాకు 255 మంది, కడప జిల్లాకు 23 మంది వచ్చినట్టు గుర్తించారు. 
 
ఇటీవల బ్రిటన్‌ నుంచి 255 మంది రాగా వారిలో 534 మంది చిరునామాలు గుర్తించామని, మరో 21 మందిని గుర్తించేందుకు సర్వైలెన్స్‌ బృందాలను ఏర్పాటు చేశామని చెప్పారు. డిసెంబరు 24 తర్వాత వచ్చిన వారిని మాత్రం క్వారంటైన్‌ సెంటర్లకు తరలిస్తామని చెప్పారు.