ఏపీలో కరోనా తగ్గుముఖం.. 24 గంటల్లో 282 కేసులు.. ఒకరు మృతి
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 282 కరోనా కేసులు నమోదయ్యాయి. శనివారం నమోదైన కేసులతో కలిపి ఏపీలో 8,80,712కు కరోనా కేసులు చేరాయి. 24 గంటల్లో కరోనాతో కడప జిల్లాలో ఒకరు మృతి చెందారు. ఇప్పటివరకు కరోనాతో రాష్ట్రవ్యాప్తంగా 7,092 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం 3,700 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా నుంచి కోలుకుని 8,69,920 మంది రికవరీ అయ్యారు.
మహమ్మారి కరోనా తగ్గిపోతుందని సంబరపడుతున్న రాష్ట్రంలో 'కరోనా స్ట్రెయిన్' కలవరపెడుతోంది. దీని తీవ్రత ఎక్కువగా ఉండటంతో అన్ని వర్గాల్లోనూ ఆందోళన రేకెత్తుతోంది. బ్రిటన్‌తో పాటు మరో నాలుగైదు దేశాల్లో తన ప్రతాపం చూపుతుండటంతో యూకే నుంచి వస్తున్నా విమానాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది.
బ్రిటన్‌లో వెలుగు చూసిన కరోనా స్ట్రెయిన్ వైరస్ 70 శాతం ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు ఇప్పటికే స్పష్టం చేశారు. ఇప్పటివరకు జిల్లాలో నమోదయినా కరోనా ప్రభావం కేవలం 20 శాతం ఉండగా, తాజా వైరస్ ప్రభావం ఇంతకు మూడు రెట్లకుపైగా ఉంటుంది.