గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 26 డిశెంబరు 2020 (15:35 IST)

పేరుకే బాడీ బిల్డర్ కానీ.. అమ్మాయిల్ని కాదని బొమ్మను పెళ్లి చేసుకున్నాడు..?

Bodybuilder
పేరుకే బాడీ బిల్డర్ కానీ.. అమ్మాయిల్ని కాదని ఓ సెక్స్ బొమ్మను వివాహం చేసుకున్నాడు. కజకిస్థాన్‌కు చెందిన బాడీబిల్డర్ యూరి తోలోచ్కో ఓ సెక్స్ టాయ్‌ను వివాహమాడిన ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సెక్స్ టాయ్‌ మార్గోతో యూరీ వివాహం మార్చిలోనే జరగాల్సి ఉండగా, కొవిడ్-19 మహమ్మారి కారణంగా ఆలస్యమయ్యింది. కేవలం 12 మంది అతిథుల సమక్షంలో నైట్ క్లబ్ వేదికగా యూరి తోలోచ్కో-మార్గోల పెళ్లి నిరాడంబరంగా జరిగింది. 
 
వేదికపై మార్గో చేతికి ఉంగరం తొడిగిన తనదానిని చేసుకున్నాడు. వివాహం తర్వాత అతిథులతో కలిసి ఈ జంట ఆనందంగా డ్యాన్స్ చేశారు.తాను వివాహమాడిన బొమ్మ క్రిస్మస్ పండుగకు ముందు విరిగిపోయిందని, దీంతో మరమ్మతులు చేయించేందుకు తన బొమ్మ భార్యను వేరే నగరానికి పంపించానని యూరి చెప్పారు. 
 
తన బొమ్మ భార్య కోలుకున్నాక తనతో గడుపుతానని చెపుతూ యూరీ బొమ్మతో తన పెళ్లి చిత్రాలను తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు. తన బొమ్మ భార్య లేని సెలవు రోజుల్లో స్నేహితులతో గడుపుతానని యూరి వివరించారు. 'పెళ్లి తరువాత ఆమెను తక్కువ మందికి చూపించాలని నిర్ణయించుకున్నాను.. అందుకే ఇన్‌స్టాగ్రామ్ నుంచి ఫోటోలను తొలగించాను" అని వెల్లడించారు.