ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 26 డిశెంబరు 2020 (14:10 IST)

సింగర్ సునీత పెండ్లి డేట్ ఫిక్స్.. ఎప్పుడో తెలుసా?

సింగర్ సునీత పెండ్లి డేట్ ఫిక్స్ అయ్యింది. ప్రముఖ మీడియా సంస్థ అధినేత రామ్ వీరపనేనితో సునీత వివాహ నిశ్చితార్థం కుటుంబ సభ్యుల సమక్షంలో ఇటీవలే జరిగిన విషయం తెలిసిందే. ఇక అందరి దృష్టి ఆమె పెళ్ళెప్పుడు అనే దానిపై పడింది. దీంతో ఒక్కొక్కరూ ఒక్కో విధమైన తేదీలతో ప్రచారం చేస్తున్నారు. ఆమె పెళ్లి ఈ నెల 27న జరిగే అవకాశం ఉందంటూ జోరుగా ప్రచారం జరిగింది.
 
అయితే.. జనవరి 9న సునీత, రామ్‌ వీరపనేని వివాహం జరగనున్నట్లు సమాచారం. అయితే.. కరోనా నేపథ్యంలో పెళ్లికి కొందరు ప్రముఖులను మాత్రమే ఆహ్మానించనున్నారని టాక్‌. జనవరి 9న వీరిద్దరి పేరుపై మంచి ముహుర్తం ఉండటంతో... మళ్లీ ఈ ముహుర్తం దాటితే మంచి రోజులు లేకపోవడంతో అదే తేదీని ఫిక్స్‌ చేసేశారట.