మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 25 డిశెంబరు 2020 (18:14 IST)

కరోనా వైరస్.. 24 గంటల్లో 11,722 మంది మృతి

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. వైరస్‌కు ఎలాంటి వ్యాక్సిన్ లేని కారణంగా పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరిగిపోతున్నాయి. కరోనా కట్టడికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని విధాల చర్యలు చేపట్టినా.. కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. 
 
తాజాగా గడిచిన 24 గంటల్లో 6,65,410 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 11,722 మంది మరణించారు. మొత్తం ప్రపంచ వ్యాప్తంగా 7,97,14,49,538 పాజిటివ్ కేసులు నమోదు కాగా, మరణాల సంఖ్య 17,48,455కు చేరింది.
 
అలాగే యాక్టివ్ కేసులు 2,18,49,988 ఉండగా, 5,61,16,095 మంది కరోనాతో కోలుకున్నట్లు ప్రపంచ ఆరోగ్య గణాంకాలు చెబుతున్నాయి. ఇక అమెరికాలో పాజిటివ్ కేసులు 1,91,11,32కు చేరగా, 3,37,066 మంది మృతి చెందారు. ఇక బ్రెజిల్‌లో 74,25,593 పాజిటివ్ కేసులుండగా, 1,90,032 మంది మృతి చెందారు.
 
అలాగే భారత్‌లో కొత్తగా 23,068 పాజిటివ్ కేసులు నమోదు కాగా,336 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటి వరకు 1,01,46,845 పాజిటివ్ కేసులు చేరుకోగా,1,47,092 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు.