1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శనివారం, 26 డిశెంబరు 2020 (10:57 IST)

దేశంలో కరోనా వివరాలు.. తెలంగాణలో తగ్గని కరోనా.. 536 మంది మృతి

దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 22,272 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,01,69,118కు పెరిగాయి. మరో 251 మంది మృత్యువాతపడగా.. మొత్తం మృతుల సంఖ్య 1,47,343కు చేరింది. ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసులు 2,81,667 ఉన్నాయని పేర్కొంది. 
 
గత 24 గంటల్లో 22,274 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 97,40,108 మంది కోలుకున్నారని మంత్రిత్వశాఖ తెలిపింది. ఇదిలా ఉండగా.. గడిచిన 24గంటల్లో 8,53,527 మందికి టెస్ట్‌ చేయగా.. మొత్తం 16,17,59,289 శాంపిల్స్‌ పరిశీలించినట్లు ఐసీఎంఆర్‌ పేర్కొంది.
 
తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంటల వరకు 30,376 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 317 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,84,391కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ శనివారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది.
 
శుక్రవారం కరోనాతో ఇద్దరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,529కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 536 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 2,76,244కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 6,618 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, 4,535 మంది హోమ్‌ ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 66,86,363కి చేరింది.