సంబంధిత వార్తలు
- Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ
- Tammareddy: మంచు విష్ణు, మనోజ్ కు మధ్యవర్తిగా తమ్మారెడ్డి భరద్వాజ
- శరవేగంగా వ్యాపిస్తున్న ఎన్బి.1.8.1 కరోనా వేరియంట్
- నాకే ఎందుకు స్వామీ ఈ పరీక్ష : శివయ్యను ప్రశ్నిస్తూ మంచు విష్ణు
- విద్యార్థుల వీసాలను నిలిపివేసిన ట్రంప్ సర్కారు!!
ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు
Mohan Babu
దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయగా హీరో విష్ణు మంచు ఈ సినిమాలో కన్నప్పగా కనిపిస్తాడు. ఇక ఈ సినిమాను కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబు భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేశారు. అయితే, ఈ చిత్ర ప్రమోషన్స్‌ను చిత్ర యూనిట్ గ్రాండ్‌గా చేస్తున్నారు. ఈ క్రమంలోనే తన కన్నప్ప కథను మోహన్ బాబు రివీల్ చేశారు.
తన కళ్లను శివుడికి ఇచ్చి తిన్నడు కన్నప్పగా చరిత్రలో నిలిచిపోయాడు. తనకు మాత్రం తన తల్లిదండ్రులు నిజమైన కన్నప్పగా మోహన్ బాబు అభివర్ణించారు. తన బిడ్డల ఆకలి తెలుసుకుని తీర్చే ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప అని మోహన్ బాబు అన్నారు. ఇక తన తల్లి లక్ష్మమ్మ పుట్టుకతో రెండు చెవులు వినించవని.. ఆమెకు ఐదు మంది సంతానం అని.. తమ ఊరికి వెళ్లాలంటే బస్సు దిగి 7 కిలోమీటర్లు నడవాల్సి వచ్చేదని.. తన ఐదు మంది సంతానంను ఎత్తుకుని ఆమె తమ ఊరికి తీసుకెళ్లేందుకు ఎంతో కష్టపడేదని తెలియజేశారు. సోషల్ మీడియా దీనిపై పాజిటివ్ లుక్ కనిపిస్తోంది.
