విద్యార్థుల వీసాలను నిలిపివేసిన ట్రంప్ సర్కారు!!
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాల్లో విద్యార్థి వీసాలను అమెరికా నిలిపివేసింది. కొత్తగా దరఖాస్తు చేసుకునే విద్యార్థుల వీసా ఇంటర్వ్యూలను షెడ్యూలింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ మేరకు మంగళవారం యూఎస్ ఎంబసీలకు దౌత్య కేబులు ద్వారా ఉత్తర్వులు జారీచేశారు.
నిబంధనలు మరింత కఠినతరం చేసే దిశగా ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పాలనా యంత్రాంగా సిద్ధమవుతోంది. విదేశీ విద్యార్థుల సామాజిక మాధ్యమ ఖాతాల తనిఖీపై కూడా అమెరికా దృష్టిసారించింది. దీంతో వివిధ దేశాల నుంచి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు చాలా మంది యూఎస్‌లో తమ భవిష్యత్ గురించి ఆందోళన చెందుతున్నారు.
ఈ ఉత్తర్వులు తక్షణం అమల్లోకి వస్తాయి. అవసరమైన సామాజిక మాధ్య ఖాతాల పరిశీలనకు సన్నాహాలు జరుగుతున్నాయి. తదుపరి ఆదేశాలు జారీ చేసేదాకా దౌత్య విభాగాలు అదనంగా ఎలాంటి వీసా అపాయింట్మెంట్లు అనుమతించవు అని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. త్వరలోనే మరిన్ని కొత్త నిబంధనలతో జారీ చేసిన తర్వాత వీసాల కోసం ముందస్తుగా బుక్ చేసుకున్న ఇంటర్వ్యూలు ప్రణాళిక ప్రకారం జరుగుతాయని పేర్కొంది.