1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Surya team visits Palani Murugan temple seeking divine power

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

Surya, Venky Atluri,  Naga Vamsi
Surya, Venky Atluri, Naga Vamsi
సూర్య 46 సినిమా ఇటీవలే హైదరాబాద్ లో ప్రారంభమైంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్ పై నాగ వంశీ నిర్మిస్తున్నారు. త్వరలో ఈ సినిమా సెట్ పైకి వెళ్లనుంది. ఈ సందర్బంగా తమ మొదటి ప్రధాన అడుగు వేసే ముందు దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్. 
 
ఇది సూర్య 46వ చిత్రం. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో ప్రొడక్షన్ నెం.33 గా తెరకెక్కనున్న ఈ చిత్రం. వెంకీ అట్లూరి..  లక్కీ భాస్కర్ వంటి అద్భుతమైన సినిమాలతో వరుస ఘన విజయాలను సొంతం చేసుకొని ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈ చిత్రంతో రవీనా టాండన్ తెలుగు సినిమాల్లోకి పునఃప్రవేశం చేస్తున్నారు. సీనియర్ నటి రాధిక శరత్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. సంగీతాన్ని జి.వి. ప్రకాష్ కుమార్ చేస్తున్నారు.
 
తర్వాతి కథనం
ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు