గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : సోమవారం, 28 డిశెంబరు 2020 (12:37 IST)

దేశంలో 1.02 కోట్ల మార్క్‌ను దాటిన కోవిడ్ వైరస్ కేసులు

భారత్‌లో కోవిడ్ వైరస్ విజృంభిస్తోంది. తాజాగా దేశంలో కరోనా వైరస్ కేసులు మరో మార్క్‌ను క్రాస్ చేశాయి. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 20,021 కోవిడ్ పాజిటివ్ కొత్త కేసులు నమోదు కాగా.. 21,131 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇదే సమయంలో 279 కోవిడ్‌తో మృతిచెందినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 
 
దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1.02 కోట్ల మార్క్‌ను కూడా క్రాస్ చేసి.. 1,02,07,871కు చేరగా.. రికవరీ కేసుల సంఖ్య 97,82,669కు పెరిగింది.. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 1,47,901 మంది కరోనాతో మృతిచెందగా.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,77,301 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు.. ఆదివారం రోజు దేశవ్యాప్తంగా 7,15,397 శాంపిల్స్ పీరక్షించామని.. ఇప్పటి వరకు 16,88,18,054 కోవిడ్ టెస్ట్‌లు చేశామని ఐసీఎంఆర్ ప్రకటించింది.