శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ఫ్లాష్ బ్యాక్ 2020
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 28 డిశెంబరు 2020 (08:49 IST)

#FlashBack2020 : సోషల్ మీడియాను షేక్ చేసిన టాప్-10 మూవీలు...

ఈ యేడాది కరోనా నామ సంవత్సరంగా మిగిలిపోయింది. ఈ సంవత్సరం సినిమా ఇండస్ట్రీకి అస్సలు ఏమాత్రం కలిసిరాలేదు. ముఖ్యంగా, తెలుగు వెండితెరకు ఇదో చీకటి సంవత్సరంగా మిగిలిపోనుంది. ఈ యేడాది సంక్రాంతి బరిలో నిలిచిన సరిలేరు నీకెవ్వరు చిత్రంతో పాటు, అల.. వైకుంఠపురం, భీష్మ చిత్రాలు మినహా ఏ ఒక్క చిత్రం సరైన హిట్‌ను సాధించలేదు. పైగా, ఈ యేడాది థియేటర్లలోకి కరోనా లాక్డౌన్‌కు ముందు విడుదలై పాత సినీ రికార్డులను తిరగరాసిన చిత్రాలుగా మిగిలిపోయాయి.
 
అయితే, ఈ యేడాది కొన్ని కొత్త చిత్రాలతో పాటు... విడుదలైన చిత్రాలకు సంబంధించిన ముచ్చట్లు మాత్రం సోషల్ మీడియాను షేక్ చేశాయి. ముఖ్యంగా, సౌత్ మూవీ ఇండస్ట్రీలో టాప్ 10 చిత్రాల జాబితాలో పలు తెలుగు చిత్రాలు కూడా ఉన్నాయి. సౌత్ మూవీలపై సోషల్ మీడియాలో జరిగి చర్చ బాలీవుడ్‌ను సైతం బిత్తరపోయేలా చేసింది.
 
అలాగే 2020లో సోషల్ మీడియాను షేక్ చేసిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. తమిళ హీరో విజయ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వంటి హీరోలు ట్విట‌ర్లో రికార్డులు తిరగరాసారు. ఈ ఏడాది అత్యధిక ట్వీట్స్ సాధించిన సౌత్ ఇండియన్ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం. అందులో విజయ్ నటించిన 'మాస్టర్', పవన్ నటిస్తున్న 'వకీల్ సాబ్', అజిత్ నటించిన 'వలిమై' వంటి సినిమాలు టాప్‌లో నిలిచాయి. టాప్-10లో తమిళ, తెలుగు హీరోలు సత్తా చూపించారు.
 
1. మాస్టర్: హీరో- దళపతి విజయ్.. దర్శకుడు లోకేష్ కనకరాజ్
2. వకీల్ సాబ్: హీరో పవన్ కళ్యాణ్.. దర్శకుడు వేణు శ్రీరామ్
3. వలిమై: హీరో -అజిత్.. దర్శకుడు వినోథ్
4. సర్కారు వారి పాట: హీరో మహేష్ బాబు.. దర్శకుడు పరశురామ్
5. సూరరై పొట్రు: హీరో సూర్య.. దర్శకురాలు సుధ కొంగర
6. ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం): హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్.. దర్శకుడు రాజమౌళి
7. పుష్ప: హీరో అల్లు అర్జున్.. దర్శకుడు సుకుమార్
8. సరిలేరు నీకెవ్వరు: హీరో మహేష్ బాబు.. దర్శకుడు అనిల్ రావిపూడి
9. కెజియఫ్ ఛాప్టర్ 2: హీరో యశ్.. దర్శకుడు ప్రశాంత్ నీల్
10. దర్బార్: హీరో రజినీకాంత్.. దర్శకుడు ఏఆర్ మురుగదాస్