గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: మంగళవారం, 29 డిశెంబరు 2020 (12:02 IST)

రామ్‌ చరణ్‌కు కోవిడ్-19, ట్వీట్ చేసిన యంగ్ హీరో

టాలీవుడ్ హీరో, మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ తనకు కోవిడ్-19 పాజిటివ్ వచ్చిందని ట్వీట్ చేశారు. పరీక్షల్లో పాజిటివ్ వచ్చిందని, ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినా హోం క్వారంటైన్ అయ్యానని రామ్‌చరణ్ చెప్పారు. త్వరలో నయం అవుతుందని, దృఢంగా బయటకు వస్తానని ఆశిస్తున్నట్లు తెలిపారు.
 
గత కొన్ని రోజులుగా తనను కలిసినవారంతా పరీక్షలు చేయించుకోవాలని, తను కోలుకోగానే మరిన్ని అప్‌డేట్స్ చెబుతానని చరణ్ ట్వీట్ చేశారు. ఈనెల 25న రామ్‌చరణ్ తన కుటుంబ సభ్యులందరూ హాజరైన క్రిస్‌మస్ పార్టీలో పాల్గొన్నారు.