1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
  4. Apple showing signs it may soon launch a search engine to compete against Google Search

గూగుల్ సెర్చింజన్‌కు పోటీగా యాపిల్ సెర్చ్ ఇంజిన్.. కానీ..?

Apple
గూగుల్ సెర్చింజన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ చిన్న పదం వెతికినా గూగుల్ సెర్చ్‌ నుంచి పూర్తి వివరణ తీసుకునే సదుపాయం వుంటుంది. ఫలితంగా సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్‌కు చెందిన గూగుల్ సెర్చ్ ఇంజిన్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి ఆదరణ ఉందో అందరికీ తెలిసిందే. 
 
అయితే దీనికి పోటీగా త్వరలో యాపిల్ కూడా నూతనంగా సెర్చ్ ఇంజిన్‌ను అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. అయితే ఆ సెర్చ్ ఇంజిన్ యాపిల్‌కు చెందిన సఫారి బ్రౌజర్‌లో పనిచేస్తుంది. ఐఫోన్లు, ఐప్యాడ్లు, మాక్‌బుక్‌లు, ఐమ్యాక్‌లలో సఫారి బ్రౌజర్‌లో సెర్చ్ చేస్తే ఇకపై గూగుల్ కాకుండా యాపిల్ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ వస్తాయి.
 
ఇక సెర్చ్ ఇంజిన్‌కు గాను ఉద్యోగం చేయడం కోసం ఇప్పటికే యాపిల్ అభ్యర్థులను ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అందువల్ల కచ్చితంగా త్వరలోనే యాపిల్ తన సొంత సెర్చ్ ఇంజిన్‌ను విడుదల చేస్తుందని తెలిసింది. ఇక త్వరలో అందుబాటులోకి రానున్న ఐఓఎస్ 14తోపాటు ఐప్యాడ్ ఓఎస్‌, మాక్ ఓఎస్‌లలోనూ ఆ సెర్చ్ ఇంజిన్‌ను యాపిల్ అందిస్తుందని తెలిసింది. 
తర్వాతి కథనం
రాజధానిగా వైజాగ్.. ఏ శక్తీ అడ్డుకోలేదు... వెన్నుపోటు దినోత్సవం : విజయసాయి రెడ్డి