1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
  4. Nokia 3, 5 And 6 Android Smartphones to be Available Starting June 15: Report

నోకియా అభిమానులకు శుభవార్త.. 15న సరికొత్త స్మార్ట్ ఫోన్లు

నోకియా అభిమానులకు శుభవార్త. వచ్చేనెల 15న నోకియా సరికొత్త స్మార్ట్‌ఫోన్లు నోకియా 6, నోకియా 5, నోకియా 3లు భారత్ లాంచ్ కానున్నాయి. ఆండ్రాయిడ్ ఓఎస్ కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ల విషయంలో నోకియా నుంచి ఇప్పటిదాకా

Nokia
నోకియా అభిమానులకు శుభవార్త. వచ్చేనెల 15న నోకియా సరికొత్త స్మార్ట్‌ఫోన్లు నోకియా 6, నోకియా 5, నోకియా 3లు భారత్ లాంచ్ కానున్నాయి. ఆండ్రాయిడ్ ఓఎస్ కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ల విషయంలో నోకియా నుంచి ఇప్పటిదాకా ఎలాంటి ప్రకటన లేదు. అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం జూన్ 13న ఈ మూడు ఫోన్లు భారత్‌లో అడుగుపెట్టనున్నాయి. 
 
త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రకటన నోకియా నుంచి వెలువడే అవకాశం ఉంది. డ్యూయల్ సిమ్‌తో వస్తున్న నోకియా 6లో 5.5 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్‌ప్లే, 2.5 డి కర్వ్‌డ్ గ్లాస్, ఆక్టాకోర్ క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్‌ను కలిగివుంటుంది. ఇదేవిధంగా అడెర్నో 505 జీపీయూ ర్యామ్, 64 జీబీ అంతర్గత మెమొరీ, 128 జీబీల వరకు పెంచుకునే సదుపాయం వుంటుంది. 
తర్వాతి కథనం
పిల్లల చదువుల కోసం కిడ్నీని అమ్మేసింది.. సిలిండర్ అమ్మి యోగిని కలిసినా?