సంబంధిత వార్తలు
- టైమ్స్ నౌ స్టింగ్ ఆపరేషన్ సాక్షిగా.. భాజపా-వైకాపా బంధాన్ని అంగీకరించిన వైకాపా నేత
- అభినందన్ ఫొటో వాడినందుకు.. ఎమ్ఎల్ఎ గారికి ఈసీ అక్షింతలు...
- నన్ను రాహుల్ అని పిలవండి ప్లీజ్.. అప్పుడే కంఫర్ట్‌గా వుంటుంది..
- ఫేస్‌బుక్‌కి ఝలక్ ఇచ్చిన ఎన్నికల సంఘం..
- కాంగ్రెస్ పార్టీ నుంచి సోనియా గాంధీ వెళ్లిపోయినా నేను పోను... చింతామోహన్ సంచలనం
కాంగ్రెస్ వాళ్లంతా పప్పు అని పెట్టుకోవచ్చు...
ప్రధాని నరేంద్ర మోదీ తాను ఈ దేశానికి చౌకీదారుని అంటూ ప్రచారం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. చౌకీదారు అంటే కాపలాదారు అని అర్థం. ఇటీవల మోదీ మై బీ చౌకీదార్ అనే ప్రచారాన్ని మొదలుపెట్టారు. తన ట్విట్టర్ అకౌంట్‌లో ఉండే పేరుకు ముందు కూడా చౌకీదార్ అని చేర్చారు. మోదీ క్యాబినెట్ మినిస్టర్‌లు సైతం మోదీ బాట పట్టారు. వారు కూడా తమ ట్విట్టర్ అకౌంట్లలో పేరు ముందు చౌకీదార్ అని జోడించారు.
చౌకీదార్ అని పేరు పెట్టుకోవడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా తప్పుపట్టింది. చౌకీదార్ పదంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. చౌకీదార్ చోర్ పై అంటూ ఎదురుదాడి మొదలుపెట్టింది. మోదీ కేవలం సంపన్నులకు మాత్రమే చౌకీదారుడు అంటూ ప్రియాంక వాద్రా కూడా విమర్శించింది.
ఈ నేపథ్యంలో హర్యానాకు చెందిన బీజేపీ మంత్రి అనిల్ విజ్ ఓ సెటైర్ వేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలు తమ ట్విట్టర్ అకౌంట్ల పేరు ముందు పప్పూ అని జోడించుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని పప్పూ అంటూ విపక్ష నేతలు వెటకారంగా సంభోదిస్తున్నారు. ఈ క్రమంలోనే అకౌంట్‌ల పేరు ముందు పప్పూ అని పెట్టుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని మంత్రి అనిల్ విమర్శలు చేసారు.
కాంగ్రెస్ కార్యకర్తలంతా తమ ఖాతా పేరు ముందు పప్పూ అని పెట్టుకోవాలని మంత్రి అనిల్ సూచించారు. ఎన్నికల తేదీలు సమీపిస్తున్న కొద్దీ ఈ మాటల యుద్ధం తీవ్రతరం అవుతోంది.
