1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. govt decides to repeal section 309 from ipc

ఐపీసీ సెక్షన్ 309 రద్దుకు కేంద్రం నిర్ణయం.. ఆత్మహత్యను నేరంగా..?

IPC section 309
ఆత్మహత్యను నేరంగా పరిగణించే ఐపీసీ సెక్షన్ 309 రద్దుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సెక్షన్‌ను రద్దు చేసే అంశంపై 18 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాలు సమర్థించాయని పేర్కొంది. ఆత్మహత్య చేసుకోవడానికి ఎవరైనా ప్రయత్నించి బతికి బయటపడితే వారిపై పోలీసులు సెక్షన్ కింద కేసు నమోదు చేసేవారు. 
 
సెక్షన్ 309 ప్రకారం ఆత్మహత్యయత్నానికి పాల్పడిన నేరానికి ఏడాది జైలు, జరిమానా ఉండేది. 1996 సంవత్సరంలో సెక్షన్ 309 రాజ్యంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. 309 సెక్షన్‌ను తొలగించాలని గతంలోనే కేంద్రానికి లా కమిషన్ సూచించింది. సెక్షన్ 309 తొలగించడంతో ఇక నుంచి ఆత్మహత్యాయత్నం నేరం కాదు.
 
ఆత్మహత్యాయత్న బాధితులకు ఆదరణ అవసరం. అలాంటి పరిస్థితుల్లో కేసుల ద్వారా వారిని మరింత బాధపెట్టడం సరికాదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.