1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Indian President Orders Probe Against AP Dy Speaker

రఘురామ కృష్ణంరాజుపై విచారణ ప్రారంభించాలి.. రాష్ట్రపతి కార్యాలయం

RRR
RRR
రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూనే రాజకీయ ప్రకటనలు చేసినందుకు గాను, ఏపీ శాసనసభ ఉప సభాపతి కె రఘురామ కృష్ణంరాజుపై విచారణ ప్రారంభించాలని భారత రాష్ట్రపతి కార్యాలయం ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శికి ఒక లేఖను పంపింది. 
 
ఏపీ ఉప సభాపతిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ 'జై భీమ్ రావు భారత్ పార్టీ'కి చెందిన పి. సురేష్ కుమార్ భారత రాష్ట్రపతి కార్యాలయానికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ ఆదేశాలు వెలువడ్డాయి. 
 
అయితే, దీనిపై ఎటువంటి చర్యలూ తీసుకోకపోవడంతో సురేష్ కుమార్ మరోసారి రాష్ట్రపతి కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన రాష్ట్రపతి కార్యాలయం, విచారణ చేపట్టాలని ఏపీ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. 
 
ఒక ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తిపై నేరుగా రాష్ట్రపతి కార్యాలయం నుంచి విచారణకు ఆదేశాలు రావడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
తర్వాతి కథనం
నాసా అదుర్స్.. 50ఏళ్ల తర్వాత చంద్రుడిపైకి మానవుడు.. ఆర్టెమిస్-II ప్రయోగం (video)