మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 3 ఆగస్టు 2017 (10:33 IST)

గోవాలోని కొల్వ బీచ్‌లో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు.. బంగ్లాదేశ్ అమ్మాయిని తీసుకొచ్చి?

గోవాలోని బీచ్ కేంద్రంగా నిర్వహిస్తున్న సెక్స్ రాకెట్ గుట్టు రట్టు అయ్యింది. బంగ్లాదేశ్ నుంచి అమ్మాయిలను రప్పించి గోవాలోని బీచ్ కేంద్రంగా సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్న ఉదంతం పోలీసుల దాడుల్లో వెలుగుచూసిం

గోవాలోని బీచ్ కేంద్రంగా నిర్వహిస్తున్న సెక్స్ రాకెట్ గుట్టు రట్టు అయ్యింది. బంగ్లాదేశ్ నుంచి అమ్మాయిలను రప్పించి గోవాలోని బీచ్ కేంద్రంగా సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్న ఉదంతం పోలీసుల దాడుల్లో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రంలోని షిమోగా జిల్లా పాండా ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల ఇమ్రాన్ అహ్మద్ ఇరవై ఐదేళ్ల బంగ్లాదేశ్ అమ్మాయిని తీసుకొని గోవాలోని కొల్వా బీచ్‌కు వచ్చాడు. 
 
బంగ్లాదేశ్ నుంచి రప్పించిన ఈ అమ్మాయితో ఇమ్రాన్ బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నాడని పోలీసుల దర్యాప్తులో వెల్లడి అయ్యింది. దీంతో పోలీసులు ఇమ్రాన్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. బంగ్లాదేశ్ యువతిని మెర్సెస్‌లోని మహిళా సదనానికి తరలించారు. ఈ ఘటనపై నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నామని పోలీసులు తెలిపారు.