గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By dv
Last Updated : మంగళవారం, 7 మార్చి 2017 (16:50 IST)

నాకు నువ్వు.. నీకు నేను : నిత్యానంద ఆశ్రమంలోకి మళ్ళీ రంజిత!

నిత్యానందస్వామి. ఒకప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పేరు. అలాగే, తమిళ సినిమాల్లో తనకంటూ గుర్తింపు సాధించుకున్న హీరోయిన్ రంజిత. వీరిద్దరు ఏకాంతంగా ఉన్న వీడియోను అప్పట్లో వారి డ్రైవర్ లీక్ చేసిన విషయమే

నిత్యానందస్వామి. ఒకప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పేరు. అలాగే, తమిళ సినిమాల్లో తనకంటూ గుర్తింపు సాధించుకున్న హీరోయిన్ రంజిత. వీరిద్దరు ఏకాంతంగా ఉన్న వీడియోను అప్పట్లో వారి డ్రైవర్ లీక్ చేసిన విషయమే. ఇది ఒక్క రాష్ట్రంలోనే కాదు. దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అటు ప్రసార మాథ్యమాలు, ఇటు సామాజిక మాథ్యమాలు కోడై కూశాయి. అంత జరిగినా సరే నిత్యానంద మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గలేదన్నది అందరికీ తెలిసిన విషయమే. రంజిత కేవలం శిష్యురాలు మాత్రమేనని వాదిస్తూ వచ్చారు. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు సైలెంట్‌గా ఉన్న గురు, శిష్యులు కాల క్రమంలో మళ్లీ కలవడం ప్రారంభించారు.
 
కొన్ని ఆధ్యాత్మిక క్షేత్రాలను కూడా ఈ గురుశిష్యులు వెళ్లి వచ్చారు. వీరు తిరుమల శ్రీవారిని కూడా దర్శించుకున్నారు. అలాగే చిత్తూరు జిల్లాలోని కొన్ని పుణ్యక్షేత్రాలను చూశారు. అయితే ఆ సంఘటన జరిగిన తర్వాత మాత్రం ఆశ్రమానికి చాలా దూరంగా ఉంటూ వస్తున్నారు. కానీ ప్రస్తుతం మాత్రం ఆమె తిరిగి నిత్యానంద ఆశ్రమానికి రాకపోకలు ప్రారంభించారట. 
 
ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్‌గా మారింది. ఎలాగో ఆ వీడియో సమయం ఎప్పుడో ముగిసిపోయింది కాబట్టి ఇక ఫ్రెష్‌గా స్టార్ట్ చేద్దామనో ఏమోగానీ రంజిత తిరిగి నిత్యానంద ఆశ్రమానికి వెళుతుండటం మాత్రం ఆ ఆశ్రమంలోని వారికి మాత్రం ఏ మాత్రం ఇష్టం లేదట. మొత్తం మీద వీరిద్దరు మళ్ళీ కలిస్తే ఏం జరుగుతుందోనన్న ఆశక్తి మాత్రం కలుగుతోంది.