ఇనుప గొలుసులతో భైరవుడు బందీ
|
షాజాపూర్ జిల్లాలోని మాల్వా-ఆగార్ గ్రామంలో కొలువై ఉన్న కోదా స్వామి కాలభైరవనాథుని ఆలయంలో ఈ చిత్రాన్ని మనం చూడవచ్చు. ఈ దేవాలయంలోని కాలభైరవుని విగ్రహం ఇనుప గొలుసులతో బంధింపబడి ఉండే దృశ్యాన్ని మనం చూడవచ్చు. ఈ దేవాలయాన్ని సందర్శించే భక్తులను కాలభైరవుడు ఎందుకు బంధించబడి ఉన్నాడని అడిగితే... కథకథలుగా కారణాలను వివరిస్తారు.
| |
| |
కోదాస్వామి కాలభైరవుడు ఝాలా రాజపుత్రులు, గుజరాతీలకు చెందిన ఆరాధ్య దైవమనీ, ఈ ఆలయం వారికి చెందినదేననీ అక్కడి గ్రామస్తులు మాతో అన్నారు. వారి కథనం ప్రకారం.... 1481 సంవత్సరంలో ఝాలా రాజపుట్ మహారాజా కలలో భగవంతుడు ప్రత్యక్షమై.. సామ్రాజ్యంలో తనకు ఓ ఆలయాన్ని నిర్మించాలని ఆదేశించాడట. భగవంతుని ఆదేశానుసారం మహారాజు కోదాస్వామి కాలభైరవ మహరాజ్ ఆలయాన్ని రాజపుట్ మహారాజు నిర్మించాడు. అంతేకాదు ఆ ఆలయానికి నలుదిశలా తన సామ్రాజ్యాన్ని విస్తరింపజేశాడు. అయితే కొందరు రాజపుత్రులు రాజస్థాన్‌కు వలసపోగా... చాలమటుకు ఇక్కడే స్థిరనివాసమేర్పరుచుకున్నారు.
|
|
|
|
మరో విచిత్రం ఏమిటంటే... భైరవునాధుడు భక్తులు సమర్పించే వైన్ సేవిస్తాడట. అంతేకాదు రోజంతా భక్తులు సమర్పించే సిగరెట్లు జాలీగా తాగేస్తాడట. కేవలం ఇటువంటివాటితోనే భైరవుని భక్తులు సంతృప్తిపరుస్తారు... తప్ప బంధవిముక్తులను మాత్రం చేయరు. ఒకవేళ బంధవిముక్తుని చేస్తే.... తిరిగి భైరవుడు తమను ఇక్కట్లపాలు చేస్తాడని ఇక్కడివారి భయం. మరో చిత్రం ఏమిటంటే.... గుట్టుచప్పుడు కాకుండా, అంటే భక్తులను సైతం బురిడీ కొట్టించి భైరవుడు వైన్ ను మస్తుగా లాగిస్తాడట. ఇటువంటి సంఘటనలపై మీ అభిప్రాయమేమిటో దయచేసి మాకు తెలియజేయండి.
