శుక్రవారం, 31 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 30 జనవరి 2025 (20:22 IST)

అధ్యక్షా... ఈ పోల్ ఇపుడు అవసరమా? పరువు పోగొట్టుకున్న టి.కాంగ్రెస్, రేవంత్ ఫైర్

T Congress poll
జనం ఏ క్షణంలో ఎలాంటి అభిప్రాయం వెలిబుచ్చుతారో ఎవ్వరికీ తెలియదు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలు ఎలాంటి పాలన కావాలని కోరుకుంటున్నారనే అంశంపై పోల్ నిర్వహించింది. ఇందులో రెండు ఆఫ్షన్స్ ఇచ్చింది. మొదటి ఆప్షన్ A. ఫామ్ హౌస్ పాలన(బీఆర్ఎస్) B. ప్రజల వద్దకు పాలన (కాంగ్రెస్). 
 
ఐతే నెటిజన్లు మాత్రం ఫామ్ హౌస్ పాలన కావాలంటూ ఏకంగా 74 శాతం ఓటింగ్ చేసారు. కేవలం 26 శాతం మాత్రమే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓట్ చేసారు. దీనితో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పోల్ లో బీఆర్ఎస్ ఫేక్ ఎకౌంట్ల ద్వారా మోసం చేసిందనీ, ఇందుకు గాను రూ. 13 కోట్లు ఖర్చు పెట్టిందంటూ ఆరోపిస్తున్నారు. ఏదేమైనప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పరువు పోయింది. ఈ సర్వేపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహంతో వున్నారని భోగట్టా.