అంబులెన్స్‌ను చోరీ చేసిన దొంగ... ఎలా పట్టుకున్నారంటే (Video)
ఓ దొంగ అంబులెన్స్‌ను చోరీ (హైజాక్) చేసి హల్చల్ సృష్టించాడు. అంబులెన్స్‌తో పారిపోతున్న దొంగను పట్టుకునేందుకు పోలీసులు పడరాన్ని పాట్లుపడాల్సి వచ్చింది. చివరకు రోడ్డుకు అడ్డంగా లారీలను పెట్టి అంబులెన్స్‌ను ఆపి... ఆ దొంగను అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని హయత్ నగర్‌లో 108 వాహనం చోరి చేసిన ఖమ్మం వైపు వెళ్లిన దొంగ... చిట్యాల వద్ద అంబులెన్స్‌ను ఆపేందుకు ఎస్ఐ జాన్ రెడ్డి ప్రయత్నం చేశాడు. కొర్లపహాడ్ టోల్ ప్లాజాను దొంగ ఢీకొట్టాడు. టేకుమట్ల స్టేజ్ వద్ద రోడ్డుకు అడ్డంగా లారీలు పెట్టి అంబులెన్స్‌ను కేతేపల్లి ఎస్ఐ శివతేజ ఆపారు. ఆ తర్వాత దొంగను అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై 108 అంబులెన్స్ హల్చల్..
— BIG TV Breaking News (@bigtvtelugu) December 7, 2024
హయత్ నగర్ లో 108 వాహనం చోరి చేసి ఖమ్మం వైపు వెళ్లిన దొంగ
చిట్యాల వద్ద అంబులెన్స్ ను ఆపేందుకు ఎస్ఐ జాన్ రెడ్డి ప్రయత్నం
కొర్లపహాడ్ టోల్ ప్లాజాను ఢీకొట్టి పారిపోయిన దొంగ
టేకుమట్ల స్టేజ్ వద్ద రోడ్డుకు అడ్డంగా లారీలు పెట్టి… pic.twitter.com/8g85Owlpdy
