ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 7 డిశెంబరు 2024 (11:05 IST)

మమతా బెనర్జీ వారసుడు ఎవరు...? బెంగాల్ సీఎం ఏమంటున్నారు?

mamata benargi
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజకీయ వారసుడు లేదా వారసురాలు ఎవరన్నది ఇపుడు చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశాన్ని మమతా బెనర్జీ వద్ద ప్రస్తావించగా, ఆమె ఆసక్తికర సమాధానమిచ్చారు. తన రాజకీయ వారసుడు ఎవరనేది పార్టీ నాయకత్వం సమిష్టిగా నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఈ విషయంలో పార్టీలోని సీనియర్, యువ నేతల మధ్య ఎలాంటి పోటీ ఉండదని అందరూ కలిసి ఏకాభిప్రాయంతో ఓ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. 
 
కాగా, ప్రస్తుతం టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీ ప్రస్తుతం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. మరో పక్క టీఎంసీలో సీనియర్లు, యువ నేతల మధ్య అంతర్గత పోరు సాగుతుంది. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ రాజకీయ వారసుడు ఎవరు అవుతారనే చర్చ జోరుగా నడుస్తోంది.
 
ఈ క్రమంలో తాజాగా మమతా బెనర్జీ ఓ ఛానల్‌తు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు. చేశారు. మీ వారసుడు ఎవరు అని విలేఖరి ప్రశ్నించగా, మీ వారసుడు ఎవరు అంటూ ఎదురు ప్రశ్న వేసి దాటవేశారు. తన రాజకీయ వారసుడు ఎవరు అనేది పార్టీ నాయకత్వమే సమష్టిగా నిర్ణయిస్తుంది తప్ప తాను కాదని అన్నారు. నేను పార్టీ కాదు.. మేమంతా కలిస్తేనే పార్టీ. ఇది సమష్టి కుటుంబం, నిర్ణయాలు సమష్టిగా తీసుకుంటాం అని పేర్కొన్నారు.
 
టీఎంసీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, ఇక్కడ ఎవరూ ఎవరిపైనా ఆధిపత్యం ప్రదర్శించరని ఆమె అన్నారు. ప్రజలకు ఏది మంచిదో పార్టీయే నిర్ణయిస్తుందని తెలిపారు. తమకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, బూత్ కార్యకర్తలు ఉన్నారని, ఇదంతా వారి సమష్టి కృషేనని అన్నారు. అందువల్ల తన రాజకీయ వారసుడు ఎంపికపై పార్టీ తీసుకునే నిర్ణయమే ఫైనల్ అవుతుందని చెప్పారు.