సంబంధిత వార్తలు
- 11కిలోల బరువు తగ్గిన కవిత.. వచ్చేవారం బెయిల్‌పై విడుదల.. కేటీఆర్
- అనుమతి లేకుండా డ్రోన్ ఎగురవేత... కేటీఆర్‌పై కేసు నమోదు
- న్యూయార్కులో అడుగుపెట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
- లోదుస్తుల విక్రయదారుడితో కేటీఆర్‌ను పోల్చిన రేవంత్ రెడ్డి
- పది రోజుల పాటు రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన.. మేక్ ఇన్ తెలంగాణ కోసం...
కేటీఆర్‌ను త్వరలోనే రేవంత్ రెడ్డి జైలులో పెడతారు.. బండి సంజయ్
Bandi Sanjay
గతంలో తనను, ఇతర నేతలను కేటీఆర్ ఎలా వేధించారో ఎవరూ మరిచిపోరని అన్నారు. తెలియని వారి కోసం, తెలంగాణలో బీఆర్ఎస్ పాలనలో ఏప్రిల్ 2023లో ఎస్ఎస్‌సీ పేపర్ లీక్ కేసులో బండి సంజయ్ అరెస్టయ్యారు.
బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనం అవుతుందనే పుకార్లను కూడా సంజయ్ కొట్టిపారేశారు. బీఆర్‌ఎస్ కాలం చెల్లిన పార్టీ అని, దీనికి భవిష్యత్తు లేదన్నారు. కవిత అరెస్ట్‌ను బీజేపీతో ముడిపెట్టి వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. కవిత బెయిల్ తిరస్కరణకు బీజేపీకి ఎలా సంబంధం ఉందని, మనీష్ సిసోడియాకు బీజేపీ బెయిల్ ఇచ్చిందా అని ప్రశ్నించారు.
పనిలో పనిగా అధికార పార్టీ కాంగ్రెస్‌పై కూడా సంజయ్ ఫైర్ అయ్యారు. అతి తక్కువ కాలంలోనే ప్రజల్లో వ్యతిరేకతను కాంగ్రెస్ అధిగమిస్తోందన్నారు. తెలంగాణలో త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య మేజర్ వార్ జరుగుతుందని, బీఆర్‌ఎస్‌ను ప్రజలు ఏమాత్రం పట్టించుకోరని అన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికపై సంజయ్ స్పందిస్తూ.. అది బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేతిలో ఉందని అన్నారు. హైకమాండ్ ఆదేశాల మేరకు పార్టీ సభ్యులు నడుచుకుంటారని చెప్పారు.
