1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. Revanth Reddy will join hands with BJP, says KTR

బీజేపీతో కచ్చితంగా రేవంత్ రెడ్డి చేతులు కలుపుతారు.. కేటీఆర్ జోస్యం

ktramarao
మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే తరహాలో రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కచ్చితంగా బీజేపీతో చేతులు కలుపుతారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు.
 
నాలుగు నెలల క్రితం గుజరాత్‌పై విమర్శలు గుప్పించిన రేవంత్‌రెడ్డి.. సోమవారం ఆదిలాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోదీతో వేదిక పంచుకున్న సందర్భంగా గుజరాత్‌ దేశానికే రోల్‌ మోడల్‌ అని వ్యాఖ్యానించారు. మోదీ "పెద్దన్న" అన్న సీఎం వ్యాఖ్యలపై రామారావు స్పందిస్తూ.. మోదీని ప్రసన్నం చేసుకునేందుకే రేవంత్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్నారు. 
 
మంగళవారం సిరిసిల్లలోని తెలంగాణ భవన్‌లో తంగళ్లపల్లిలో జరిగిన బీఆర్‌ఎస్‌ పార్టీ సమావేశంలో రామారావు మాట్లాడుతూ.. 2021లో మోదీ రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. తెలంగాణ ఒకప్పుడు దేశానికే రోల్ మోడల్‌గా ఉండేదని, ఇతర రాష్ట్రాలు తెలంగాణను అనుసరించాయని అన్నారు.  
About Writer
సెల్వి