1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 4 మార్చి 2024 (10:43 IST)

మార్చి 11న ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం

cmrevanth reddy
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది. ఆరు ఎన్నికల హామీల్లో భాగంగా ఈ నెల 11న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు.
 
ఈ పథకానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సిద్ధం చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. భూమి ఉన్న వారికి రూ.5 లక్షలు, ఇళ్లు లేని పేదలకు భూమితో పాటు రూ.5 లక్షలు ఇళ్ల నిర్మాణానికి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
 
ఈ నెల 11వ తేదీన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆరు హామీల అమలులో భాగంగా ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టాలన్నారు.