సంబంధిత వార్తలు
- ఉచిత ప్రయాణం-బస్సుల సంఖ్య పెంచరా? కన్నీళ్లు పెట్టుకున్న యువతి!?
- ఇంజనీరింగ్ విద్యార్థులకు శుభవార్త.. గ్రేస్ మార్కులు కలిపేందుకు ఒకే...
- శంషాబాద్ విమానాశ్రయానికి టీఎస్ ఆర్టీసీ బస్సులు
- ఆస్ట్రేలియాలో విద్యాభ్యాసం చేయాలనివుందా.. అయితే, ఆంగ్ల భాషపై పట్టుండాల్సిందే...
- సోయాబీన్స్ చెడిపోకుండా మాత్రలు.. అలానే వండిశారు.. 60మందికి?
పురుషుల కోసం ప్రత్యేక బస్సులు.. జీరో టికెట్ అని చిన్న చూపు సరికాదు..
పురుషుల కోసం ప్రత్యేక బస్సులు నడిపే విషయంపై టీఎస్సాఆర్టీసీ యోచిస్తోంది. వృద్ధుల(పురుషులు)కు ప్రత్యేకంగా సీట్ల కేటాయింపుపైనా కసరత్తు జరుగుతున్నట్లు తెలిసింది. మరోవైపు విద్యార్థులకు సైతం కొన్ని మార్గాల్లో సర్వీసులు నడిపే విషయాన్ని ఉన్నతాధికారులు చర్చిస్తున్నారు.
సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక సీట్లలో తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిసింది. సమయాల వారీగా రద్దీపై సమగ్ర సమాచారం వచ్చాక పురుషులకు, విద్యార్థులకు స్పెషల్ బస్సులు నడపడంపై ఉన్నతాధికారులు ఆలోచన చేస్తున్నారు.
ఇది సాధ్యం కాదంటే మహిళలకు మాత్రమే ప్రత్యేక బస్సులు నడపడం.. ఇలా రకరకాల చర్చలు జరుగుతున్నాయని ఆర్టీసీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం.
జీరో టికెట్ అని మహిళా ప్రయాణికుల్ని చిన్నచూపు చూడటం సరికాదని.. వారి తరఫున ప్రభుత్వం ఆ ఛార్జీ చెల్లిస్తోందని ఆర్టీసీకి చెందిన ఓ ఉన్నతాధికారి వెల్లడించారు.
తర్వాతి కథనం
