ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 28 డిశెంబరు 2023 (19:38 IST)

భర్తతో గొడవపడి బయటికి వస్తే.. కాళ్లు చేతులు కట్టేసి గ్యాంగ్ రేప్

Rape
ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళపై నలుగురు సామూహిక అత్యాచారం చేశారు. బారాబంకి జిల్లాలోని దేవా ప్రాంతంలో దళిత మహిళపై అత్యాచారానికి పాల్పడిన కారణంగా నలుగురు వ్యక్తులను పోలీసులు తెలిపారు. సోమవారం భర్తతో గొడవపడి అత్తమామల ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె తన తల్లి ఇంటికి వెళుతుండగా, నలుగురు వ్యక్తులు - మొఘల్ ఆజం అలియాస్ రియాజ్, అష్రఫ్ అలియాస్ భురే, షబ్బు, ఇస్లాముద్దీన్ - ఆమెను ఒక కారులో డ్రాప్ చేయడానికి ముందుకొచ్చారని పోలీసులు తెలిపారు. 
 
కారులో ఎక్కకపోయేసరికి ఆమెను బలవంతంగా కారులో ఎక్కించుకుని.. నిర్మానుష్య ప్రాంతంలో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కాళ్లు చేతులు కట్టేసి ఆమెపై ఈ దారుణానికి పాల్పడ్డారు దుండగులు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులలో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. బాధిత మహిళకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, నిందితులందరినీ అరెస్టు చేశామని అదనపు పోలీసు సూపరింటెండెంట్ సీఎన్ సిన్హా తెలిపారు.