1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. Undavalli Arun Kumar Interesting Comments On YS Jagan

చంద్రబాబును జైలులో పెట్టి జగన్ పెద్ద తప్పు చేశారు.. ఉండవల్లి

undavalli arun kumar
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో వర్షం కాస్త తగ్గుముఖం పట్టింది. ఏపీలో గ్యాప్ ఇవ్వకుండా దంచి కొడుతోంది. ఈ వర్షాలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్  స్పందించారు. 
 
ఎన్నికల అఫిడవిట్‌లో చంద్రబాబు రూ.900 కోట్ల ఆస్తులను చూపించారు. చంద్రబాబు చట్టం ప్రకారం నడుచుకునే వ్యక్తి. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి చట్ట ప్రకారం నడుచుకోవాలన్నారు.
 
ఈ నెల 11వ తేదీన మార్గదర్శి కేసు వియంలో ఉన్న వాయిదాలో ఏపీ సర్కార్ అఫిడవిట్ వేయాలని భావిస్తున్నానని.. కక్షసాధింపు చర్యల వల్ల అధికారుల తీరుమారనుంది. భవిష్యత్‌లో సీఎంల మాటను ఐపీఎస్ అధికారులు వినే అవకాశం లేదని ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయ పడ్డారు.
 
అధికారులపై కేసులు పెట్టే అంశంపై జగన్ తప్పు చేశారని గుర్తుచేశారు. ఆ తప్పును చంద్రబాబు చేయకూడదని కోరారు. చంద్రబాబును జైలులో పెట్టి జగన్ పెద్ద తప్పు చేశారని ఉండవల్లి అరుణ్ కుమార్ గుర్తుచేశారు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
జనసైనికులను చూస్తేనే వణికిపోతున్న పేర్ని నాని.. ఎందుకు తెలుసా?