సంబంధిత వార్తలు
- eBike Explosion: ఎలక్ట్రిక్ బైక్ పేలి తండ్రి, కూతురు మృతి.. ఎలక్ట్రిక్ బైక్లు ఎలా పేలతాయి? ప్రమాదాన్ని ముందే గుర్తించడం ఎలా?
- బిడ్డ శవాన్ని పది కిలో మీటర్ల మేర భుజాలపై మోసిన తండ్రి.. ఎక్కడ?
- నయనతార నిర్మాణ సంస్థపై కేసు!
- మాతృత్వానికే మాయని మచ్చ.. మైక్రో ఓవెన్లో పెట్టి..?
- చిరంజీవి, సల్మాన్ ఖాన్ నటిస్తున్న గాడ్ ఫాదర్ ముంబై షెడ్యూల్ పూర్తి
కన్నకూతురిపై అత్యాచారానికి పాల్పడిన తండ్రి అరెస్ట్
కామాంధులు రెచ్చిపోతున్నారు. వావి వరుసలు మరిచి అత్యాచారాలకు పాల్పడుతున్నారు. తాజాగా కన్నకూతురిపై అత్యాచారానికి పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
వివరాల్లోకి వెళితే మర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. మండలంలోని ఓ కుగ్రామానికి చెందిన నిందితుడు మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. మొదటి ఆమెతో విడిపోగా రెండో భార్య చనిపోయింది. మూడో సంబంధానికి ఓ కుమారుడు, కుమార్తె. భార్యకు మతిస్థిమితం లేదు. కుమార్తె (15)పై మూడేళ్లుగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు.
ఈ విషయాన్ని కుటుంబంతో పరిచయం కొనసాగిస్తున్న నిందితుడి మొదటి భార్యకు బాధితురాలు ఫోన్ చేసి చెప్పింది. ఆమె సూచనతో డయల్ 100కు సమాచారం ఇచ్చింది. పోలీసులు స్పందించి తండ్రిని సోమవారం రిమాండ్‌కు తరలించినట్లు డీఏస్పీ తెలిపారు.
తర్వాతి కథనం
