1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Hyderabad Heavy rains: Cars washed away, 30 persons missing

హైదరాబాద్ భారీ వర్షం: కార్లు కొట్టుకుపోయి 30 మంది గల్లంతు-video

Hyderabad Heavy rains
హైదరాబాద్‌- బెంగళూరు జాతీయ రహదారి కోతతో పలు వాహనాలు గల్లంతయ్యాయి. వరద ఉధృతికి గగన్‌పహాడ్‌ వద్ద హైదరాబాద్‌- బెంగళూరు జాతీయ రహదారి కోతకు గురైంది. సమీపంలో ఉన్న అప్పాచెరువు కట్టతెగి జాతీయ రహదారిపైకి వరదనీరు చేరడంతో రహదారి కొట్టుకుపోయింది.
 
ఈ ఘటనలో రహదారిపై వెళ్తున్న కార్లు కొట్టుకుపోయి దాదాపు 30 మంది గల్లంతయ్యారు. ఇప్పటివరకు మూడు మృత దేహాలను వెలికితీశారు. బస్సులు, కార్లు, లారీలు వరద నీటిలో కొట్టుకుపోయి దెబ్బతిన్నాయి.
 
రోడ్డు కోతకు గురైన ప్రాంతాన్ని బుధవారం ఉదయం రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌, రంగారెడ్డి కలెక్టర్ అమోయ్‌ కుమార్‌, సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ పరిశీలించి సహాయక చర్యలు చేపట్టారు. జాతీయ రహదారిని మూసివేసి ట్రాఫిక్‌ను ఔటర్‌ రింగ్‌రోడ్డుకు మళ్లించినట్టు రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ తెలిపారు.
తర్వాతి కథనం
మతం మార్చుకుంటేనే కాపురం చేస్తా.. లేదంటే విడాకులే : పాట్నాలో లవ్ జిహాద్