బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Raju
Last Modified: హైదరాాబాద్ , బుధవారం, 28 జూన్ 2017 (05:03 IST)

మెడికల్‌ ల్యాబ్‌లో పుట్టిన మదపిచ్చి.. టెక్నీషియన్‌పైనే అత్యాచారయత్నం

ఆడదాని జూడ బ్రహ్మకైన బుట్టు రిమ్మతెగులు అని ప్రబంధ కవి ఊరికే అనలేదు. ఆడది ఇంటా బయటా కనిపిస్తే చాలు కామ నరం కట్టలు తెంచుకుని పరుగెడుతోంటే సందుదొరికితే ఎవరినో ఒకరిని రేప్ చేయాలనే ఆలోచనే మన జనాలకు. బయట జరిగే ఆకృత్యాలు, అత్యాచారాలు చాలవని ఒక ప్రబుద్దుడు

ఆడదాని జూడ బ్రహ్మకైన బుట్టు రిమ్మతెగులు అని ప్రబంధ కవి ఊరికే అనలేదు. ఆడది ఇంటా బయటా కనిపిస్తే చాలు కామ నరం కట్టలు తెంచుకుని పరుగెడుతోంటే సందుదొరికితే ఎవరినో ఒకరిని రేప్ చేయాలనే ఆలోచనే మన జనాలకు. బయట జరిగే ఆకృత్యాలు, అత్యాచారాలు చాలవని ఒక ప్రబుద్దుడు తాను పని చేసే మెడికల్ ల్యాబ్‌లోనే అత్యాచారానికి సాహసించేశాడు. ఆ అమ్మాయి కాస్త తెలివితో ఉండి అరవడంతో చాన్స్ పోయిందనే కోపంతో ఆమెను బాది పారిపోయాడు. ఫిర్యాదు చేయడం, పోలీసులు నాలుగు బాది లోపలేయడం వరుసగా జరిగిపోయాయి. 
 
కాగజ్‌నగర్‌ పట్టణంలోని అగ్రసేన్‌ భవన్‌ ముందు ఉన్న మెడికల్‌ ల్యాబ్‌లో సోమవారం రాత్రి ఒక యువతిపై అత్యాచార యత్నం జరిగినట్లు పట్టణ ఎస్సై ప్రభాకర్‌ రెడ్డి తెలిపారు. ఎస్సై ప్రభాకర్‌ రెడ్డి కథనం ప్రకారం.. పట్టణంలోని బాలాజీనగర్‌కు చెందిన యువతి (20) అగ్రసేన్‌ భవన్‌ ముందు ఉన్న సాయి రత్న క్లీనికల్‌ ల్యాబ్‌లో పని చేస్తోందని. అదే ల్యాబ్‌లో ప్రైవేట్‌ టెక్నిషియన్‌గా పని చేస్తున్న కాగజ్‌నగర్‌ మండలం అందవెల్లి గ్రామానికి చెందిన మేకర్తి రవి సోమవారం రాత్రి యువతీపై అత్యాచార యత్నానికి పాల్పడినట్లు ఎస్సై తెలిపారు.
 
అయితే ఆ సమయంలో అమ్మాయి ప్రతిఘటించడంతో రవి యువతిపై చేయి చేసుకున్నాడని ఎస్సై వివరించారు. కేకలు వేయడంతో రవి అక్కడి నుండి పరారయ్యాడని, బాధితురాలు మంగళవారం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, మేకర్తి రవిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.
 
మేరా మహాన్ భారత్ హై.. భారత మాత తన ముద్దు బిడ్డల యవ్వారాలు చూసి నవ్వుతోంది. దీనంగా...