బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శనివారం, 13 మే 2017 (04:18 IST)

అమ్మాయి ఒప్పుకోలేదా.. గోడకేసి బాదు.. తర్వాత ఊచలు లెక్కపెట్టు.. ఒక సాప్ట్ వేర్ వన్ సైడ్ ప్రేమ

ఒక వైపు డొనాల్డ్ ట్రంప్ పెట్టిన పెంటకు వేలాది ఉద్యోగాలు ఐటీ రంగంలో మాయమై పోతున్నాయి. ఇన్నాళ్లుగా నిర్భీతిగా ఐటీ సాక్షిగా బతికేసిన వారి జీవితాలు ఆగమాగమవుతున్నాయి. ఉన్న ఉద్యోగం ఒక్కటీ ఊడితే అటూ ఇటూ కాకుండా పోతామన్న భయం వేలాది మంది సాఫ్ట్ వేర్ ఇంజనీర్లన

ఒక వైపు డొనాల్డ్ ట్రంప్ పెట్టిన పెంటకు వేలాది ఉద్యోగాలు ఐటీ రంగంలో మాయమై పోతున్నాయి. ఇన్నాళ్లుగా నిర్భీతిగా ఐటీ సాక్షిగా బతికేసిన వారి జీవితాలు ఆగమాగమవుతున్నాయి. ఉన్న ఉద్యోగం ఒక్కటీ ఊడితే అటూ ఇటూ కాకుండా పోతామన్న భయం వేలాది మంది సాఫ్ట్ వేర్ ఇంజనీర్లను, ఇంజనీరమ్మలను వణికిస్తోంది. ఉద్యోగాలు ఊడబీకితే ఎంత పీక్కపోతే ఎంత అనే ధైర్యం ఇప్పుడు ఐటీరంగంలో కలికానిక్కూడా లేదు. కళ్లముందు నిరుద్యోగ భూతం ఉవ్వెత్తున లేచి ఆవహిస్తున్నా చలించని మన సాఫ్ట్ వేర్ వీరుడు వన్ సైడ్ ప్రేమ బలవంతంతో ఊచలు లెక్కపెడుతున్నాడు. 
 
తనకు ఇష్టం లేదంటున్నా బలవంతపెడుతూ తననే పెళ్లి చేసుకోవాలంటూ తోటి ఉద్యోగిని వేధిస్తున్న ఓ హైదరాబాదీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఘట్‌కేసర్ ప్రాంతానికి చెందిన చరణ్ చౌదరి ఓ ప్రముఖ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. అతడు తోటి ఉద్యోగిని ఒకరిని ప్రేమ, పెళ్లి పేరుతో వెంటపడి అల్లరి చేస్తున్నాడు. అయితే చాలాకాలంగా అతని ప్రేమను ఆమె తిరస్కరిస్తూ వచ్చింది. ఆ నేపథ్యంలో గురువారం సాయంత్రం చరణ్ ఆ యువతిని కలిసేందుకు ఆమె ఇంటికి వెళ్లాడు.
 
తనను పెళ్లి చేసుకోవాలని మరోసారి ఆమెను కోరాడు. అందుకు ఆమె అంగీకరించలేదు. ఆమె పదేపదే నిరాకరించడంతో విసుగు చెందిన చరణ్ ఆమెపై దాడికి దిగాడు. ఆ యువతిని కొట్టి, గోడకేసి బలంగా గుద్దాడు. అతని నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసుకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న చరణ్ చౌదరిని అరెస్ట్ చేశారు.
 
మనోడి వాటం చూస్తుంటే ఐటీ సంస్థల యజమానులు ఉద్యోగాలు పీకకముందే తన ఉద్యోగాన్ని, జీవితాన్ని తనకుతానే పీకేసుకున్నట్లు కనబడుతోంది మరి.