1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Srinivas Kuchipudi wife to get us visa

కూచిభొట్ల భార్యకు అమెరికా వీసా మంజూరు

అమెరికాలో దారుణ హత్యకు గురైన హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శ్రీనివాస్ కూచిభొట్ల సతీమణికి అమెరికా వీసాను మంజూరు చేసింది. ఆ దేశ ఎంపీ యోడర్ కృషి ఫలితంగా ఈ వీసా మంజూరుకావడం గమనార్హం.

Srinivas Kuchipudi
అమెరికాలో దారుణ హత్యకు గురైన హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శ్రీనివాస్ కూచిభొట్ల సతీమణికి అమెరికా వీసాను మంజూరు చేసింది. ఆ దేశ ఎంపీ యోడర్ కృషి ఫలితంగా ఈ వీసా మంజూరుకావడం గమనార్హం. 
 
గత ఫిబ్రవరిలో శ్రీనివాస్ కూచిభొట్ల అమెరికాలో దారుణ హత్యకు గురైన విషయం తెల్సిందే. భర్త అంత్యక్రియల కోసం శ్రీనివాస్ భార్య సునయన భారత్‌కు వచ్చారు. దీంతో ఆమె అమెరికాలో నివశించే హక్కును కోల్పోయారు. 
 
ఈ నేపథ్యంలో తనకు అమెరికాలో ఉండటానికి, అక్కడ పనిచేయడానికి అవకాశం కల్పించాలని ఆమె ఆ దేశ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో వర్క్ వీసా మంజూరు కోసం ఆ దేశానికి చెందిన ఎంపీ యోడర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. చివరికి సునయనకు తాత్కాలిక వర్క్ వీసా మంజూరు చేసింది. 
తర్వాతి కథనం
21 నుంచి అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఆఫర్లు