మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 28 జూన్ 2021 (21:42 IST)

తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. 9మంది మృతి

తెలంగాణలో కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. 24 గంటల్లో 993 కరోనా కేసులు వెలుగు చూశాయి. ఒక్కరోజులో తొమ్మిది మంది మృతి చెందారు. దీని ప్రకారం మొత్తంగా 3 వేల 644 మంది మృతి చెందారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 06 లక్షల 04 వేల 093 గా ఉంది. గృహ/సంస్థల ఐసోలేషన్ గల వ్యక్తుల సంఖ్య 13 వేల 869గా ఉంది. 
 
ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే..?
ఆదిలాబాద్ 02. భద్రాద్రి కొత్తగూడెం 58. జీహెచ్ఎంసీ 124. జగిత్యాల 24. జనగామ 10. జయశంకర్ భూపాలపల్లి 19. జోగులాంబ గద్వాల 04. కామారెడ్డి 05. కరీంనగర్ 49. ఖమ్మం 50. కొమరం భీం ఆసిఫాబాద్ 05. మహబూబ్ నగర్ 15.
 
మహబూబాబాద్ 51. మంచిర్యాల 59. మెదక్ 10. మేడ్చల్ మల్కాజ్ గిరి 45. ములుగు 32. నాగర్ కర్నూలు 11. నల్గొండ 78. నారాయణపేట 05. నిర్మల్ 04. నిజామాబాద్ 06. పెద్దపల్లి 48. రాజన్న సిరిసిల్ల 24. రంగారెడ్డి 39. సంగారెడ్డి 10. సిద్దిపేట 33. సూర్యాపేట 72. వికారాబాద్ 10. వనపర్తి 11. వరంగల్ రూరల్ 18. వరంగల్ అర్బన్ 37. యాదాద్రి భువనగిరి 25. మొత్తం 993.